క్రీడలతో స్నేహభావం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
విజేతలకు బహుమతులు
కొడిమ్యాల, జనవరి 15: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మండల కేంద్రంలో గడ్డం బాపురెడ్డి స్మారకార్థం అతడి కొడుకులు గడ్డం లక్ష్మారెడ్డి, నరేందర్‌రెడ్డి నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు ప్రదా నం చేశారు. అనంతరం మాట్లాడుతూ, కొడిమ్యాలలో మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మొదటి బహుమతి సాధించిన ఏఎస్ఆర్ కొడిమ్యాల జట్టుకు, రెండో బహుమతి సాధించిన కొడిమ్యాల సీనియర్స్ యూత్ జట్టు సాధించింది. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఉప సర్పంచ్ గడ్డం జీవన్‌రెడ్డి, ఎర్రోజ్ మోహనచారి, ఏనుగు ఆదిరెడ్డి తదితరులున్నారు.
టీఆర్ఎస్వీ క్యాలెండర్ ఆవిష్కరణ
కొడిమ్యాల, జనవరి 15: చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన 2021 సంవత్సర క్యాలెండర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఇక్కడ టీఆర్ఎస్వీ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి రేకులపల్లి సతీశ్, కొడిమ్యాల, పూడూర్ సింగిల్ విండోల చైర్మన్లు మేనేని రాజనర్సింగారావు, బండ రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు అనుమాండ్ల రాఘవరెడ్డి, మాజీ సర్పంచ్ ఒల్లాల లింగాగౌడ్తోపాటు పలువురు ఉన్నారు.
తాజావార్తలు
- ఇక ప్రజా క్షేత్రంలో...సమరమే..
- ఏపీ అమరావతిలో వింత శబ్దాలతో భూకంపం
- మార్చిలోనే మధురఫలం
- రాష్ట్రంలో 39 డిగ్రీలకు చేరిన ఎండలు
- 27-02-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- జీవకోటికి.. ప్రాణవాయువు
- సీసీఆర్టీలో ఈ లెర్నింగ్ వర్క్‌షాపు
- జైళ్ల సిబ్బంది, ఖైదీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
- దివ్యాంగులకు కొత్త జీవితం
- సంద చెరువు సుందరీకరణ