శనివారం 16 జనవరి 2021
Jagityal - Jan 14, 2021 , 01:25:30

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలకు వరం

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 

19మందికి చెక్కుల అందజేత

మల్యాల, జనవరి 13: సీఎంఆర్‌ఎఫ్‌ సాయం నిరుపేదలకు వరంలాంటిదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన మండలపరిషత్‌ కార్యాలయంలో 19 మందికి రూ.5,88,500 విలువ చేసే సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరవగా  వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి సుదర్శన్‌, బద్దం తిరుపతిరెడ్డి, బోయినపల్లి మధుసూదన్‌రావు, జనగాం శ్రీనివాస్‌, కట్కూరి తిరుపతి, గడ్డం మల్లారెడ్డి, ఆకుల నగేశ్‌, పొన్నం మల్లేశం, నలువాల బుచ్చయ్య, సంత ప్రకాశ్‌రెడ్డి, ఆగంతం వంశీధర్‌, శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి స్వామివారిని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాకార మండపంలో స్వామివారి శేషవస్త్రంతో రవిశంకర్‌ను ఆలయ అధికారులు, అర్చకులు సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌శర్మ, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు, సంపత్‌, అర్చకుడు జితేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.