ఘనంగా గోదారంగనాథుల కల్యాణం

ఆలయాల్లో నేత్రపర్వంగా సాగిన తంతు
కోరుట్ల, జనవరి13: ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో గోదాదేవి-రంగనాథుల కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకుడు బీర్నంది నర్సింహాచారి నేతృత్వంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్ర్తోక్తంగా వివాహం జరిపించారు. వేడుకకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు కూచిపూడి నృత్య కళాకా రుల ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే వెంకటేశ్వర భజన మండలి వారితో భజన కార్యక్రమం ఏర్పా టు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ పైడివెల్లి నర్సయ్య, కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి-ప్రభాకర్, ఆండాళ్ గోష్టి, బృందసభ్యులు పాల్గొన్నారు.
మెట్పల్లి టౌన్, జనవరి 13: పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర ఆలయంలో గోదాదేవి రంగనాథుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపి ఆ తర్వాత అర్చకుడు నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కల్యాణం జరిపించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు హాజ రై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. అదే విధంగా మెట్పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహజన్ నర్సింహులు, మాడిశెట్టి ప్రభాకర్, గంగుల మురళి, దొంతుల రాజ్‌కుమార్, చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్, గంగాగౌడ్, శ్రీధర్, గంగుల పండిత్, మహజన్ శివకుమార్, కోట విజయ్‌కుమార్, శ్రీనివాస్, ఆంజనేయులు, వేంకటేశ్వర ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
సారంగాపూర్, జనవరి 13: రేచపల్లి గ్రామంలోని శ్రీ జగన్నాథస్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణాన్ని ఆలయ అర్చకుడు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కల్యాణాన్ని భక్తులు తిలకించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం, జనవరి 13: వేములకుర్తి శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గోదా రంగనాయకుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సున్నం నవ్యశ్రీ, నాయకులు సున్నం సత్యం, దేశెట్టి రాజారెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు నాంపల్లి వెంకటాద్రి, శ్రీహరి, అనిల్, సురేశ్, వేణు, అర్చకులు శ్రీనివాసాచార్యు లు, జానకీరామాచార్యులు, అరవింద్, కృష్ణాచార్యులు కొండమాచార్యులు పాల్గొన్నారు.
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల శ్రీ కోదండరామాలయంలో గోదాదేవి కల్యా ణం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై గోదా రంగనాథుల ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు పూర్ణచంద్రాచార్యులు, శ్రీనివాసాచార్యులు, మురళీమోహనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అనంతరం కల్యాణ తంతు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నీలగిరి సత్యనారాయణ రావు, కౌన్సిలర్ ఒద్ది శ్రీలత, ఆలయ చైర్మన్ గౌరిశెట్టి హరీ శ్, జలేంధర్‌రావు, సత్యనారాయణ, మనోహర్ రావు, బీ రమేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
జగిత్యాల టౌన్, జనవరి 13: జిల్లా కేంద్రంలోని శ్రీఅష్టలక్ష్మీ దేవాలయంలో శ్రీ గోదారంగనాథస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు కుంకుమ పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీమిండియాను చూసి నేర్చుకోండి
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు