శనివారం 06 మార్చి 2021
Jagityal - Jan 11, 2021 , 01:02:37

ధర్మపురి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ధర్మపురి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌    

రైతు బజార్‌ పనుల పరిశీలన 

ధర్మపురి, జనవరి 10: ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు. ధర్మపురి పట్టణంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న రైతుబజార్‌ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా పనుల్లో వేగం పెంచాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుబజార్‌లో ఒకేసారి 216 మంది కూరగాయ లు అమ్ముకునేలా షెడ్లు నిర్మిస్తున్నామన్నారు. వీటితోపాటు 36 మాంసం దుకాణాల షెడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పక్కనే ఉన్న చింతామణి చెరువును రూ.1.36కోట్లతో సుందరీకరించినట్లు తెలిపారు. పవిత్ర గోదావరిలో మురుగునీరు కలువకుండా రూ.3.80కోట్లతో హైదరాబాద్‌ తరహాలో అండర్‌గ్రౌండ్‌డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తిచేసినట్లు తెలిపారు. మరో రూ.3 కోట్లు వెచ్చించి వాటర్‌ సీనరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను నిర్మించి మురుగునీటిని శుద్ధి చేస్తామన్నారు. టెంపుల్‌ సిటీ అభివృద్ధికి రూ.100కోట్లు బడ్జెట్‌లో ఇదివరకే కేటాయించినట్లు గుర్తుచేశారు. రూ.6కోట్లతో ధర్మపురి జాతీయ రహదారి నాలుగులేన్ల రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆయన వెంట డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌, వైస్‌చైర్మన్‌ సునీల్‌కుమార్‌, నాయకులు సంగి శేఖర్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావ్‌, అలీం, రమేశ్‌ తదితరులున్నారు

VIDEOS

logo