శనివారం 06 మార్చి 2021
Jagityal - Dec 23, 2020 , 02:04:25

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు

ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నీరు

 వచ్చే వేసవిలోగా పనులు పూర్తి చేయాలి

 ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు 

 అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష

మెట్‌పల్లి/మెట్‌పల్లిటౌన్‌: వచ్చే వేసవిలోగా మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని కోరుట్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్‌ మీటింగ్‌ హాల్‌లో మిషన్‌ భగీరథ, విద్యుత్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, వార్డు బాధ్యులతో పట్టణంలో కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికీ తాగునీరు వచ్చే విధంగా పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టాలని, కౌన్సిలర్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. పట్టణ వ్యాప్తంగా అన్ని వార్డుల్లో మిషన్‌ భగీరథ పథకం కింద నీటి సరఫరా కోసం రూ.43 కోట్లతో ట్యాంకులు, పైప్‌లైన్‌ పనులు చేపట్టారన్నారు. ఈ సందర్భంగా తాగునీరు, విద్యుత్‌ సమస్యలను  కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, ప్రజారోగ్య విభాగం డీఈఈ ప్రసాద్‌, ఏఈ రాజ్‌కుమార్‌, ఎన్‌పీడీసీఎల్‌  ఏడీఈ మనోహర్‌, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు, ఆయా వార్డుల ప్రతినిధులు పాల్గొన్నారు. 


VIDEOS

logo