శనివారం 16 జనవరి 2021
Jagityal - Dec 05, 2020 , 02:04:36

ప్రజల సౌకర్యార్థమే మరుగుదొడ్లు

ప్రజల సౌకర్యార్థమే మరుగుదొడ్లు

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌
  • జిల్లా కేంద్రంలో మరుగుదొడ్లు ప్రారంభం

జగిత్యాల అర్బన్‌: పరిశుభ్రత, ప్రజల సౌకర్యం కోసం మరుగుదొడ్లు నిర్మించినట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపల్‌ పరిధిలో ఐఎంఏ హాల్‌, ఎస్‌కేఎన్‌ఆర్‌, బైపాస్‌రోడ్డులోని గొల్లపల్లి వైపు, కరీంనగర్‌ వైపు నాలుగు చోట్ల రూ.6.5లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాగా ఆవిర్భవించిన అనంతరం కొన్ని వేల మంది ప్రజలు వివిధ అవసరాలకు జగిత్యాలకు వస్తున్నారని, మల, మూత్రవిసర్జనకు ఇబ్బందులు పడకుండా మరుగుదొడ్లు నిర్మించినట్లు చెప్పారు. మంత్రి కేటీఆర్‌ తీసుకున్న నిర్ణయం మేరకు వీటిని నిర్మించామని పేర్కొన్నారు. జగిత్యాల పట్టణం నూతన కౌన్సిల్‌గా ఏర్పడ్డ తర్వాత పారిశుధ్య నిర్వహణకు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు. నర్సింగాపూర్‌ శివారులో డంపుయార్డ్‌ ఏర్పాటు చేశామన్నారు. రూ.2కోట్లతో చెత్త ద్వారా ఎరువుల తయారీ యూనిట్ల నిర్మాణాలకు ఇటీవలే పనులు ప్రారంభించామన్నారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కూరగాయల మార్కెట్ల అభివృద్ధికి నిధులు కేటాయించామన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు మల్లికార్జున్‌, అడువాల జ్యోతి, వల్లపు రేణుక, రాజ్‌కుమార్‌, మేక పద్మావతి, ఒద్ది శ్రీలత, కో ఆప్షన్‌ సభ్యులు రియాజ్‌మామ, శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ ఉపాధ్యక్షుడు ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

సత్ఫలితాలనిస్తున్న గొర్రెల పంపిణీ

రాయికల్‌ రూరల్‌: గొల్లకుర్మలను ఆర్థికంగా ఆదుకునేందకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పంపిణీ కార్యక్రమం సత్ఫలితాలనిస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని కుర్మపల్లెలో బీర య్య విగ్రహ పతిష్ఠాపనోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో చేతినిండా పని దొరికి గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. త్వరలో రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, సర్పంచ్‌ రాజమల్లు, ఎంపీటీసీ మోర విజయలక్ష్మి, రాయికల్‌ మండల పరిషత్‌ కోఆప్షన్‌ మెంబర్‌ ముఖీద్‌, నాయకులు తలారి రాజేశ్‌, రత్నాకర్‌రావు, అనుమల్ల మహేశ్‌, సాగర్‌రావు, ఆశాలు, మల్లయ్య పాల్గొన్నారు.

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

జగిత్యాల రూరల్‌: జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ కార్యకర్త జంగ గంగారాం శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందగా, అతడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. జంగ గంగారాం తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయన మరణం టీఆర్‌ఎస్‌కు తీరని లోటన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, సర్పంచులు ఎల్ల గంగనర్సు, బోనగిరి నారాయణ, ఉప సర్పంచ్‌ పద్మ, ఏఎంసీ డైరెక్టర్‌ మోహన్‌రెడ్డి, నాయకులు ఎల్ల రాజన్న, తిరుపతి, సత్యం, శ్రీనివాస్‌ తదితరులున్నారు.