ఆదివారం 17 జనవరి 2021
Jagityal - Dec 04, 2020 , 01:58:28

పేదలకు ఆసరాగా సీఎం సహాయనిధి

పేదలకు ఆసరాగా సీఎం సహాయనిధి

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌
  • లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

జగిత్యాల రూరల్‌: పేదలకు ఆసరాగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణం, జగిత్యాల అర్బన్‌ మండలానికి చెందిన 31మంది లబ్ధిదారులకు రూ.12,02,500 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. వివిధ శస్త్ర చికిత్సలు చేసుకొని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ ఉపాధ్యక్షులు అల్లాల ఆనందరావు, దూమాల రాజ్‌కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్‌, క్యాదాసు నవీన్‌, కూతురు రాజేశ్‌, దరూర్‌ సర్పంచ్‌ డెక్క ప్రభాకర్‌, జిల్లా యూత్‌ అధ్యక్షుడు దావ సురేశ్‌, అర్బన్‌ జడ్పీటీసీ సంగెపు మహేశ్‌, ప్యాక్స్‌ చైర్మన్‌ శీలం సురేందర్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ అధ్యక్షుడు ఐల్నేని సురేందర్‌రావు, నాయకులు శంకర్‌, రామ్మోహన్‌రావు, మొగిలి, శేఖర్‌, నరేందర్‌, దేశాయి, ప్రవీణ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.  

అన్నిదానాల కన్నా రక్తదానం మిన్న

జగిత్యాల రూరల్‌: అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. రెడ్‌క్రాస్‌, ఆపి ప్రివెంట్‌ హెల్త్‌ క్లినిక్‌, రోటరీ క్లబ్‌, భారత్‌ పెట్రోలియం జగిత్యాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విరూపాక్షి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన భారత్‌ పెట్రోల్‌ బంక్‌ సిబ్బందిని అభినందించారు. అనంతరం ఇప్పటివరకు 16 సార్లు రక్తదానం చేసిన సందీప్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, డీఎఫ్‌వో వెంకటేశ్వర్‌రావు, సిరిసిల్ల శ్రీనివాస్‌, టీవీ సూర్యం, నర్సింహారెడ్డి, సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.