ఆదివారం 24 జనవరి 2021
Jagityal - Dec 04, 2020 , 01:58:32

నారు పెంచే విధానంపై క్షేత్ర ప్రదర్శన

నారు పెంచే విధానంపై క్షేత్ర ప్రదర్శన

జగిత్యాల టౌన్‌: పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం దత్తత గ్రామమైన జగిత్యాల మండలం వెల్దుర్తిలో గురువారం పాలిథీన్‌ షీట్లపై వరి నారు పెంచే పద్ధతిపై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త పి.మధుకర్‌రావు మాట్లాడుతూ.. పాలిథీన్‌ షీట్లపై వరి నారును పెంచితే ఎకరానికి 12నుంచి 14కిలోల విత్తనం సరిపోతుందన్నారు. ఎకరానికి 80 మ్యాట్లు అవసరం ఉంటుందని, పాలిథీన్‌ షీట్లపై చెక్క ఫ్రేంను అమర్చి అందులో దమ్ము చేసిన బురద మట్టిని రాళ్లు లేకుండా చూసుకోవాలన్నారు. 24 గంటలు నానబెట్టి మరో 24గంటలు మండెకట్టిన వరి విత్తనాలను ఫ్రేంలోని ఒక్కో కానాలో వచ్చేలా చల్లుకోవాలన్నారు. గింజలపై కొద్దిగా వర్మీ కంపోస్టును చల్లి, విత్తనం దెబ్బతినకుండా నారుమడిపై గడ్డిని లేదా గోనె సంచులను కప్పాలన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ పద్ధతిని రైతులంతా పాటించాలని సూచించారు. దత్తత గ్రామ ఇన్‌చార్జి, శాస్త్రవేత్త సాధ్వి, సర్పంచ్‌ బుర్రా ప్రవీణ్‌గౌడ్‌, రైతులు పాల్గొన్నారు. 


logo