ఆదివారం 24 జనవరి 2021
Jagityal - Dec 03, 2020 , 00:57:32

సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

సమన్వయంతో అభివృద్ధికి కృషి చేయాలి

మండల సర్వ సభ్య సమావేశంలో రాష్ట్ర మంత్రి ఈశ్వర్‌

పెగడపల్లి: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ఉంటూ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. బుధవారం ఎంపీపీ గోలి శోభ అధ్యక్షతన నిర్వహించిన పెగడపల్లి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాగా, జడ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పరిష్కరిస్తూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పక్కా ప్రణాళికతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని  తెలిపారు. నగరాలతో పాటు, పట్టణాలు, పల్లెలు, తండాలు ప్రగతి పథంలో సాగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైస్‌ ఎంపీపీ గాజుల గంగాధర్‌, విండో చైర్మన్లు కర్ర భాస్కర్‌రెడ్డి, మంత్రి వేణుగోపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతినాయక్‌, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటేశం, కో-ఆప్షన్‌ సభ్యుడు రహీం, మండల అధికారులు శ్రీనివాస్‌, శంషేర్‌అలీ, ఆదిత్య, సుధాకర్‌, మహేందర్‌, సమత, పవిత్ర, వేణు, సర్పంచులు శ్రీనివాస్‌, రాజేశ్వర్‌రావు, కరుణాకర్‌రెడ్డి, లక్ష్మణ్‌, కొండయ్య, బాబుస్వామి, రాకేశ్‌, లక్ష్మి, వనజ, అంజమ్మ, ఎంపీటీసీలు స్వాతి, శోభ, అనసూర్య తదితరులు పాల్గొన్నారు.logo