ఆన్లైన్లో ఇన్స్పైర్ మనాక్

- కరోనా నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం
- అందుబాటులోకి ప్రత్యేక యాప్
జగిత్యాల: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది ఇన్స్పైర్ మనాక్ కార్యక్రమంలో మార్పులు చేర్పులు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా నిర్వహించే ఈ పోటీలను ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుం డా ఆన్లైన్లో నిర్వహించేలా ప్రత్యేకంగా ‘యాప్'ను రూపొందించారు. ఇందుకు ఆయా జిల్లాల సైన్స్ అధికారులకు ఇప్పటికే ఆన్లైన్ పోటీలపై రాష్ట్ర స్థాయిలో అవగాహన సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో పోటీలకు ఎంపికైన విద్యార్థులు వారి గైడ్ ఉపాధ్యాయుల సాయంతో నమూనాలు సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు అందాయి.
మనాక్ యాప్ ద్వారా పోటీలు
ఇన్స్పైర్ మనాక్ కోసం ప్రత్యేకంగా యాప్ విడుదల చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘manak compition’ విద్యార్థి గుర్తించు సంఖ్య నమోదు చేయగానే సెల్‌కు ఓటీపీ (వన్‌టైం పాస్వర్డ్) వస్తుంది. దీన్ని నమోదు చేయగానే వివరాలు వెల్లడవుతాయి. ఈ యాప్‌ను ఈ నెల 4నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎంపికైన విద్యార్థి ప్రాజెక్టులను వివరిస్తూ రెండు నిమిషాల నిడివితో వీడియో తీయాలి. ఈ వీడియో 30 ఎంబీలకు మించకూడదు. నాలుగు చిత్రాలను ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. వీటిలో విద్యార్థి చదువుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం, ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించాలి. మరో మూడు చిత్రాల ప్రదర్శనకు సంబంధించి అప్లోడ్ చేయాలి. వెయ్యి పదాలకు మించకుండా ప్రదర్శన వివరాలు రాయాలి. ఇంటర్నెట్లో అప్లోడ్ చేయవచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా తప్పులుంటే తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్ ప్రదర్శనలకు సిద్ధం
వాస్తవానికి గత ఫిబ్రవరిలో జిల్లా స్థాయిలో ప్రదర్శనలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ సిద్ధం చేసింది. 10వ తరగతి పరీక్షలు సమీపించడంతో జూన్‌కు వాయిదా వేశారు. కొవిడ్ నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోలేదు. ఎట్టకేలకు ఆన్లైన్లో ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. 2019-20లో రాష్ట్ర స్థాయిలో 370ప్రదర్శనలు ఎంపికై జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. 141పాఠశాలలు ఈ ఇన్స్పైర్ పోటీల్లో పాల్గొననున్నాయి. ఇప్పటికే విద్యార్థుల ఖాతాల్లోకి రూ.10వేలు జమయ్యాయి. ఈ మొత్తాన్ని పరిశోధన పరికరాల కొనుగోలు, రూపకల్పనకు ఉపయోగిస్తారు.
ప్రదర్శన షెడ్యూల్
ఇన్స్పైర్ మనాక్‌కు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు ‘మనాక్ యాప్' డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు న్యాయ నిర్ణేతలు ఈ ప్రదర్శనలు తిలకిస్తారు. ఐదు రోజుల పాటు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. వచ్చిన ప్రదర్శనల్లో 10 శాతం నమూనాలను రాష్ట్ర స్థాయికి ఎంపికైన జాబితా పంపిస్తారు. రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ ఈ నెల 21 నుంచి 27 వరకు నిర్వహిస్తారు.
అవసరమయ్యేవి రూపొందించాలి
సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులను రూపొందించాలి. ప్రధానోపాధ్యాయులు, గైడ్ ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేసి, సమయంలోపు ఆన్లైన్ చేయడానికి ఫొటోలు, వీడియో సిద్ధం చేసుకుని, విద్యార్థుల ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రదర్శనలను రూపకల్పన చేయించాలి.
- బాజోజి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారిసంపూర్ణ సహకారం అందించాలి
గైడ్ ఉపాధ్యాయులు నిర్ణీత గడువులోగా పాఠశాలకు ఎంపికైన విద్యార్థులతో పోటీ లు, వీడియోలు పూర్తి చేయించాలి. ఇందుకు ప్రధానోపాధ్యాయులు సంపూర్ణ సహకారం అందించాలి.
- జగన్మోహన్రెడ్డి, డీఈవో
తాజావార్తలు
- కనకరాజుకు మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి అభినందనలు
- మృతదేహాన్ని తరలిస్తూ మరో ఐదుగురు దుర్మరణం..!
- అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
- సిక్సర్ బాదిన సన్నీ లియోన్
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం
- సైడ్ ఎఫెక్ట్స్ భయంతో కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరం