శనివారం 23 జనవరి 2021
Jagityal - Dec 02, 2020 , 00:44:57

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

జగిత్యాల రూరల్‌: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా సెర్ప్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మల్లేశం సూచించారు. జగిత్యాల రూరల్‌, అర్బన్‌ మండలాల్లోని అంతర్గాం, అంబారిపేట, గుల్లపేట, అనంతారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 160 కొనుగోలు కేంద్రాల ద్వారా 6,75,314 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ.56.95కోట్లు రైతులకు చెల్లింపులు చేశామన్నారు.


logo