‘నన్ను క్షమించండి.. నాకు పెళ్లి ఇష్టం లేదు’

- నాకు చదువుకోవాలని ఉంది
- ఎస్ఐ కావాలన్నదే నా లక్ష్యం
- తల్లిదండ్రులకు చెప్పలేక సూసైడ్ నోట్ రాసి యువతి బలవన్మరణం
- జైన గ్రామంలో విషాదం
ధర్మపురి రూరల్: ‘నాకు పెళ్లి ఇష్టం లేదు. నేను చదువుకుంటాను. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేక, స్థిమితంగా ఉండలేక చనిపోతున్నాను. నన్ను క్షమించండి’ అంటూ ఓ యువతి సూసైడ్ నోట్ రాసి ఉరేసుకొని బలవన్మరణం పొందింది. మండలంలోని జైన గ్రామంలో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని నింపింది. ఎస్ఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సట్ట బుచ్చన్న, వెంకటవ్వ దంపతుల కూతురు సట్ట వనిత(19) సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని జ్యోతిబాపూలే రెనిడెన్షియల్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నది. ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నది. ఇటీవల సమీప బంధువుల పెళ్లిళ్లు జరిగాయి. ఈ క్రమంలో అందరి పెళ్లిళ్లు అవుతున్నాయని, వనితను కూడా పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. అయితే చదువులో టాపర్‌గా ఉన్న వనితకు పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకోలేక, ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక లోలోపల కుమిలిపోయింది. ఏం చేయాలో తెలియక సూసైడ్ నోట్ రాసి పెట్టి మంగళవారం ఇంట్లో దూలానికి ఉరేసుకుంది. ‘చదువుకోవడం అంటే నాకు ఇష్టం. బాగా చదివి ఎస్ఐ కావలన్నదే నా లక్ష్యం. కానీ కుటుంబ పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు నాకు పెండ్లి చేస్తామంటున్నారు. నాకు పెళ్లి ఇష్టం లేదు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పలేక చనిపోతున్నాను. నన్ను క్షమించండి’ అంటూ సూసైడ్ నోట్లో రాసింది. ఉదయం పొలం పనులకు వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి చేరిన తల్లిదండ్రులు దూలానికి వేలాడుతున్న బిడ్డను చూసి నిర్ఘాంతపోయారు. బోరున విలపించారు. తండ్రి బుచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు.
తాజావార్తలు
- క్రేజీ అప్డేట్ ఇచ్చిన మహేష్ బావ
- బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ ఆఫీసుకు వ్యాపారవేత్త
- మేకను బలిచ్చిన పోలీస్.. సస్పెండ్ చేసిన అధికారులు
- జీవితంపై విరక్తితో విద్యార్థి ఆత్మహత్య
- ఫోన్ లాక్‌పై మాజీ భార్యతో గొడవ.. 15 కత్తిపోట్లు
- మూడవ టీకాకు అనుమతి ఇవ్వనున్న అమెరికా
- పైన పటారం అనే సాంగ్‌తో అనసూయ రచ్చ
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయినట్టే: విజయ్ రూపానీ
- ట్రైలర్‌తో ఆసక్తి రేపిన గాలి సంపత్ టీం
- 200 మంది ఖైదీలు పరారీ.. 25 మంది మృతి