పట్టణంలో సరిపడా మార్కెట్లు ఏర్పాటు చేస్తాం

మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి
జగిత్యాల అర్బన్: ప్రజల సౌకర్యార్థం పట్టణంలో ఎక్కువ సంఖ్యలో మార్కెట్లు ఏర్పాటు చేసి, రైతులు కూరగాయలు విక్రయించుకునేలా వసతులు కల్పిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని చైర్పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. సమావేశంలో 10 అంశాలపై చర్చ జరుగగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ప్రధాన కూరగాయల మార్కెట్లో రైతులకు మాత్రమే కూరగాయలు విక్రయించుకునేలా ప్రాధాన్యత కల్పించాలన్నారు. ప్రజల సౌకర్యార్థం పలు ప్రాంతాల్లో మార్కెట్లను ఏర్పాటు చేయాలని, చెత్తరహిత జగిత్యాలగా తీర్చిదిద్దాలని, పారిశుధ్య నిర్వహణకు అదనంగా కార్మికులను నియమించాలని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. కౌన్సిల్ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన పలు సూచనలను అమలు చేస్తామన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ పట్టణ పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పట్టణంలో ఉన్న వైకుంఠధామాలను అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశ ఎజెండాను ఉర్దూలో ప్రచురించి అందజేసినందుకు మైనార్టీ కౌన్సిల్ సభ్యులు చైర్‌పర్సన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఇక మొబైల్లోనే ఓటరు గుర్తింపు కార్డు
- ఎయిర్‌పోర్ట్‌లో రానా, మిహీక
- చిరుతను చంపి.. వండుకుని తిన్న ఐదుగురు అరెస్ట్
- పాయువుల్లో బంగారం.. పట్టుబడ్డ 9 మంది ప్రయాణికులు
- వాళ్లను చూస్తే కాజల్‌కు మంటపుడుతుందట..
- జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల
- పది మంది ఉగ్రవాదులపై ఎన్ఐఏ చార్జిషీట్
- గుడిపల్లిలో దారుణం.. తల్లిని చంపిన తనయుడు
- రఫేల్ జెట్ : దేనికైనా రెడీ
- 150కి చేరిన కొత్త రకం కరోనా కేసులు