సోమవారం 01 మార్చి 2021
Jagityal - Nov 28, 2020 , 01:07:31

అభివృద్ధే గెలిపిస్తుంది

అభివృద్ధే గెలిపిస్తుంది

మెట్‌పల్లి టౌన్‌: అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే, మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా బాలాజీనరగ్‌ 115వ డివిజనల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని శిరీషాబాబురావు, మహిళలతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేసిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, మార్గం గంగాధర్‌, వైద్యుడు రాణవేని సత్యనారాయణ, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు కాళ్ల కిశోర్‌, మొరపు గంగాధర్‌, మన్నె ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆకుల ప్రవీణ్‌, లింగంపెల్లి సంజీవ్‌, తిరుసుల్ల అర్జున్‌, మొరపు తేజ, అలీం, ఎండీ జావీద్‌, జియా, జాకిర్‌ తదితరులు పాల్గొన్నారు. 

ధర్మపురి/బుగ్గారం: 135వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితాకిశోర్‌కు మద్దతుగా ధర్మపురి, బుగ్గారం మండలాల నాయకులు ప్రచారం నిర్వహించారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, బుగ్గారం జడ్పీటీసీ బాదినేని రాజేంధర్‌, ఏఎంసీ చైర్మన్‌ అయ్యోరి రాజేశ్‌కుమార్‌, నాయకులు సంగి శేఖర్‌, ఇనుగంటి వెంకటేశ్వర్‌రావు, మురికి శ్రీనివాస్‌, భారతపు గుండయ్య, చేర్నేని మల్లేశం, శ్రీనివాస్‌, దాసరి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. 

పెగడపల్లి: 135 డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితాకిశోర్‌కు మద్దతుగా డివిజన్‌ పరిధిలోని ద్వారకానగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ తిరుపతినాయక్‌, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు తిర్మణి రమణారెడ్డి, లక్ష్మణ్‌, బాబుస్వామి, సురేందర్‌రెడ్డి, వెంకన్న, ఆనందం, తిరుపతి, అజయ్‌, వీరేశం, శంకర్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo