సోమవారం 08 మార్చి 2021
Jagityal - Nov 28, 2020 , 01:00:08

ఆరేళ్లలో 60 ఏండ్ల అభివృద్ధి

ఆరేళ్లలో 60 ఏండ్ల అభివృద్ధి

రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి: రాష్ట్రంలో 60 ఏండ్ల సమై క్య పాలనలో జరుగని అభివృద్ధి టీఆర్‌ ఎస్‌ హయాంలో ఆరేళ్లలో జరిగిందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఉద్ఘాటిం చారు. సీఎం కేసీఆర్‌ ఒక విజన్‌ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాగంగా 135వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితా-కిశోర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించా రు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అత్యధిక మెజారిటితో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకా లు, అభివృద్ధి పనులను వివరించారు. ని స్సహాయకులకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందజేస్తున్నామన్నారు. హైదరాబాద్‌కు వరదలు వచ్చినప్పుడు ముందుండి ఇంటింటికీ సాయం అందించామన్నారు. మన రాష్ర్టానికి కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ చేసిందేమీలేదని విమర్శించారు. రాష్ట్రం లో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సా రించారన్నారు. మత మౌఢ్యంతో దుం దుడుకుగా వ్యవహరిస్తున్న బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పొరపాటున గెలిస్తే ఇప్పుడున్న ప్రశాంతత దెబ్బతింటుదన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.. 

VIDEOS

logo