సోమవారం 18 జనవరి 2021
Jagityal - Nov 27, 2020 , 00:12:37

విధి నిర్వహణలో పోటీతత్వం అలవర్చుకోవాలి

విధి నిర్వహణలో పోటీతత్వం అలవర్చుకోవాలి

జగిత్యాల  క్రైం: విధి నిర్వహణలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన మహిళా కానిస్టేబుళ్లకు నూతన టెక్నాలజీపై జిల్లా కేంద్రంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన నెల రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ హాజరై మాట్లాడారు. అధికారుల సూచన ప్రకారం విధులు నిర్వహిస్తూ రిమార్కులు లేకుండా చూసుకోవాలని సూచించారు. శిక్షణను విజయవంతం చేసిన ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ సరిలాల్‌, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.