గ్రేటర్లో జిల్లా నేతల ఇంటింటి ప్రచారం

టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్‌రావు ప్రచారం
ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్ల అభ్యర్థన
జగిత్యాల రూరల్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత బుధవారం ప్రచారం నిర్వహించారు. జీహెచ్ఎంసీలోని రెడ్‌హిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ప్రియాంక గౌడ్‌కు మద్దతుగా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, 89వ డివిజన్ గాంధీనగర్ అభ్యర్థి ముఠా పద్మకు మద్దతుగా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, 103వ డివిజన్ టీఆర్ఎస్ అభ్య ర్థి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియొద్దీన్‌కు మద్దతుగా జగిత్యాల ఏఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్‌రావు, ప్యాక్స్ చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.
మెట్పల్లి టౌన్: బాలాజీనగర్ 115వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శిరీషాబాబురావుకు మద్దతుగా కూకట్పెల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, మార్గం గంగాధర్, వైద్యుడు రాణవేని సత్యనారాయణ, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారు కాళ్ల కిశోర్, మొరపు గంగాధర్, నాయకులు రాజేశ్, నాగభూషణం, తేజ, జావిద్, జియా, రాయల్ నాయక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మపురి: జీహెచ్ఎంసీ పరిధిలోని 135వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి సబితాకిశోర్‌కు మద్దతుగా ధర్మపురి నేతలు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, నాయకులు చిలివేరి శ్యాంసుందర్, సంగి శేఖర్, ఇనుగంటి వెంకటేశ్వర్రావు, మురికి శ్రీనివాస్, భారతపు గుండయ్య తదితరులున్నారు..
సారంగాపూర్: 75వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రియాంకగౌడ్ తరఫున తరపున సారంగాపూర్, బీర్పూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ సొల్లు సురేందర్, ప్రజాప్రతినిధులు, నాయకులు జోగినపల్లి సుధాకర్‌రావు, వెంకటరమణారావు, నల్ల మహిపాల్‌రెడ్డి, రిక్కల ప్రభాకర్, పర్వతం రమేశ్, చిక్రం మారుతి, బందెల రాజేశం, శ్రీనివాస్‌రావు, రామకిష్టు గంగధరి తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల: ఉప్పల్ చిలుకానగర్ ఏడో డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బన్నాల గీతకు మద్దతుగా జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జాగృతి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లేశ్‌యాదవ్, యూత్ జిల్లా కో గంగుల శ్రీనివాస్, మండల కన్వీనర్ మాదం మధు, నాయకులు పుల్ల జగన్‌గౌడ్, సోమయ్య, నరేశ్, గంగాధర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కోరుట్ల రూరల్: 115వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి శీరీషాబాబురావుతో కలిసి ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, మండల నాయకులు కూకట్‌పల్లిలోని బాలాజినగర్, రాఘవేంద్రకాలనీ, అంబేద్కర్‌నగర్, లంబాడీ తండాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నాయకు లు గడ్డం ఆదిరెడ్డి, వనతడుపుల అంజయ్య, దమ్మ భీంరెడ్డి, తుకారాం, రాజనర్సయ్య తదితరులున్నారు.
వెల్గటూర్: 135వ డివిజన్ వెంకటాపూర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సబితకు మద్దతుగా మండల నాయకులు ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. జడ్పీటీసీ సుధారాణి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పోడేటి సతీశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, ఎండపల్లి సర్పంచ్ మారం జలేందర్‌రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గూడ రాంరెడ్డి, నాయకులు మూగల సత్యం, కొప్పుల సురేశ్, బిటుకు శ్రీహరి, సింధూజ, పడిదం వెంకటేశ్ తదితరులున్నారు.
మల్లాపూర్: బాలాజీనగర్‌లోని 115వ డివిజన్లో టీఆర్ఎస్ ఆభ్యర్థి శిరీషాబాబురావును గెలిపించాలని మండల నేతలు గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ చైర్మన్ ముద్దం శరత్, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, టీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు మేకల సతీశ్, నాయకులు ఆదిరెడ్డి, రాజేశ్, జీవన్‌రెడ్డి, సత్తార్, రాజేందర్, అశోక్, రామాగౌడ్, నర్సయ్య, రఫీ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
కథలాపూర్: 39వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి చింతల శ్రీనివాస్‌కు మద్ధతుగా సంతోష్‌నగర్‌లో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి ప్రచారం చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి శ్రీనివాస్‌ను గెలిపించాలని కోరారు.
పెగడపల్లి: 135 డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి సబితాకిశోర్‌కు మద్దతుగా బూదేవీనగర్, మానసానగర్, ద్వారకానగర్‌లో మండల నాయకులు ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, విండో చైర్మన్ కర్ర భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతినాయక్, సర్పంచులు లక్ష్మణ్, బాబుస్వామి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గ్లోబల్ ఐటీ దిగ్గజంగా టీసీఎస్!
- ఢిల్లీ గణతంత్ర వేడుకలకు గిరిజన మహిళ..!
- టిక్‌టాక్ సహా 59 చైనా యాప్‌లపై పర్మినెంట్ బ్యాన్!
- కూలిన ఆర్మీ హెలికాప్టర్.. పైలట్ మృతి
- కల్నల్ సంతోష్‌కు మహావీర చక్ర
- మేక పిల్లను రక్షించబోయి యువకుడు మృతి
- తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం
- మహారాష్ట్రలో తొలిసారి రెండు వేలలోపు కరోనా కేసులు
- రాజస్థాన్‌లో పెట్రోల్ భగభగ.. లీటర్ @ రూ.100
- పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం