బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

జగిత్యాల రూరల్: బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత అని జగిత్యాల రూరల్ ఎంపీడీవో రాజేశ్వరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం యూనిసెఫ్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంయుక్తంగా నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం ఆన్ చైల్డ్ ఫ్రెండ్లీ లోకల్ గవర్నెన్స్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్లో భాగంగా పిల్లల హక్కులు, అభివృద్ధి, పోషకాహార ప్రాధాన్యత తదితర అంశాలపై రెండు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనన్లు మోహన్‌రావు, మహేందర్ పోషణ విధానం, ఆరోగ్య స్థితి, చదువు తదితర అంశాలపై చర్చించారు. పిల్లల సమస్యలు, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, భావోద్వేగ వికాసం వంటి వాటిపై ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు చొరవ చూపి పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్ గంగాధర్, ఎంపీవో శ్రీనివాస్, యూనిసెఫ్ ప్రతినిధులు రవికుమార్, దేవీప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లక్షద్వీప్‌లో కరోనా అలజడి.. అప్రమత్తమైన కేంద్రం
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులు
- అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
- కిస్ ఇవ్వలేదని.. ఆమె నన్ను వదిలేసి వెళ్లింది
- ఫాలో అయిపోండి..లేకపోతే వీరబాదుడే
- మా టీమ్‌తో జాగ్రత్త.. టీమిండియాకు పీటర్సన్ వార్నింగ్
- తెలంగాణకు నలుగురు ఐపీఎస్ ఆఫీసర్ల కేటాయింపు
- అమెరికాలో 4 లక్షలు దాటిన కరోనా మృతులు
- టోల్ ప్లాజాపై ఎంపీ అనుచరులు దాడి.. వీడియో
- ‘డ్రాగన్ ఫ్రూట్’ పేరు మారుతోంది..