బుధవారం 27 జనవరి 2021
Jagityal - Nov 25, 2020 , 00:43:01

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం ఖాయం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం ఖాయం

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు
  • పాల్గొన్న స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు

మెట్‌పల్లి టౌన్‌:  జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 115వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శిరీషాబాబురావు విజ యం ఖాయమని కోరుట్ల ఎమ్మెల్యే చైర్మన్‌ కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. మంగళవా రం  అభ్యర్థి శిరీష, మహిళలతో కలిసి  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం  మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న త ర్వాత అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ ఖ్యా తినార్జించిందన్నారు.  మెట్‌పల్లి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోయినిపెల్లి చంద్రశేఖర్‌ రావు, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, నే తలు రాణవేని సత్యానారాయణ, మార్గం గంగాధర్‌, డీలర్‌ మల్లయ్య, తోట శ్రీనివాస్‌, నల్ల ఆదిరెడ్డి, కొమ్ముల జీవన్‌రెడ్డి, ఎండీ జావిద్‌  ఉన్నారు.

ఇబ్రహీంపట్నం: బాలాజీనగర్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి శిరీశకు మద్దతుగా  మండల నేతలు   ప్రచారం నిర్వహించారు.   ఇంటింటికీ వెళ్లి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎల్లాల దశరథరెడ్డి, నాయకులు నేమూరి సత్యనారాయణ, జేడీ సుమన్‌, పొన్‌కంటి వెంక ట్‌, చిన్నారెడ్డి, జగన్‌రావు పాల్గొన్నారు.   

మెట్‌పల్లి రూరల్‌:  115వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శిరీషాబాపురావుకు మద్దతుగా  మండల నేతలు ఓట్లు అభ్యర్థించారు. మెట్‌పల్లి ఎంపీపీ మారు సాయిరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండలా ధ్యక్షుడు నోముల గంగాధర్‌, ఆత్మనగర్‌ సర్పంచ్‌ జరుపుల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ కొండ్రికర్ల గ్రామాధ్యక్షుడు రాజరెడ్డి, మైనార్టీ సెల్‌ పట్టణాధ్యక్షుడు జావిద్‌, మ్యాన ప్రసాద్‌, తిరుపతిరెడ్డి  ఉన్నారు.

మల్లాపూర్‌:   టీఆర్‌ఎస్‌ ఆభ్యర్థి శిరిషాబాబురావు ను గెలిపించాలని   టీఆర్‌ఎస్‌  నేతలు ప్రచారం చేశారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ మం డలాధ్యక్షుడు తోట శ్రీనివాస్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కదుర్క నర్స య్య, వైస్‌ చైర్మన్‌ ముద్దం శరత్‌, ఆర్బీఎస్‌ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, టీఆర్‌ఎస్‌వై మండలాధ్యక్షుడు మేకల సతీశ్‌, నేతలు కాటిపల్లి ఆదిరెడ్డి, ఆకుతోట రాజేశ్‌, కొమ్ముల జీవన్‌రెడ్డి, సత్తార్‌, డబ్బ రాజేందర్‌, రాజేశ్‌,  అశోక్‌, రంగు రామాగౌడ్‌, నర్సయ్య, రఫీ, సంతోష్‌ పాల్గొన్నారు. 

కోరుట్ల రూరల్‌ :   ఎంపీపీ తోట నారాయణ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్‌ ప్రచారాన్ని చేపట్టారు. 115వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శిరీషాబాబురావును అధిక మెజార్టీతో గెలిపించాలంటూ బాలాజీనగర్‌లోని ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటేయాలంటూ అభ్యర్థించారు. గడ్డం ఆదిరెడ్డి, మార్గం ప్రతాప్‌, అంజ య్య, గుగ్గిల్ల సురేశ్‌గౌడ్‌, దమ్మ భీంరెడ్డి, కుం టా ల వికాస్‌, పొట్ట సురేందర్‌, తుకా రాం,   వినో ద్‌, సలావొద్దీన్‌, క్యాతం సృజన్‌ పాల్గొన్నారు.  

పెగడపల్లి: హైదరాబాద్‌లోని వెంకటాపురం135 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సబితాకిశోర్‌కు మద్దతుగా టీఆర్‌ఎస్‌ మండల నేతలు ప్రచారం చే శా రు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశాల మేరకు   పార్టీ నేతలు రెండు బృం దాలుగా ప్రచారం నిర్వహించారు. వెంకటాపురం డివిజన్‌ పరిధిలోని భూదేవినగర్‌, మానసానగర్‌, ద్వారకానగర్‌లో పార్టీ అభ్యర్థి సబితతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఎంపీపీ గోలి శోభా సురేందర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, విండో చైర్మన్‌ కర్ర భాస్కర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తిరుపతినాయక్‌, సర్పంచులు లక్ష్మణ్‌, బాబుస్వామి, ఆర్బీఎస్‌ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నేతలు గోలి సురేందర్‌రెడ్డి, బండి వెంకన్న, రాజు, ఆంజనేయులు, తిర్మణి రమణారెడ్డి, మాదారపు కరుణాకర్‌రావు, తోట మోహన్‌రెడ్డి, ఇరుగురాల ఆ నందం, ముంబై రాజిరెడ్డి, మడిగెల తిరుపతి, వె ల్మ సత్యనారాయణరెడ్డి, గోలి సంజీవరెడ్డి, పులి రాజేశం, బాల్సాని శ్రీనివాస్‌, రాచకొండ ఆనం దం, వీరేశం,  లక్ష్మీనారాయణ, మహేశ్‌ ఉన్నారు.

సారంగాపూర్‌ :   75వ డివిజన్‌ అభ్యర్థి ప్రి యాం కా గౌడ్‌ తరఫున జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజ య్‌ కుమార్‌ ప్రచారం చేశారు.   జడ్పీ స భ్యుడు మేడిపల్లి మనోహర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సొల్లు సురేందర్‌, పోతారం ఎంపీటీసీ జోగిన్‌పెల్లి సుధాకర్‌రావు, లచ్చక్కపేట సర్పంచ్‌ వెంకటరమణారావు, బీర్‌పూర్‌ మండల ప్రజాప్రతినిధులు నల్ల మహిపాల్‌ రెడ్డి, రిక్కల ప్రభాకర్‌, పర్వతం రమేశ్‌, చిక్రం మారుతి, బందెల రాజేశం పాల్గొన్నారు. 

జగిత్యాల రూరల్‌ : జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత 89వ డివిజన్‌ గాంధీనగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మకు మద్దతుగా  ప్రచారం చేశా రు. గడపగడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ నాయకులు తదితరులున్నారు.


logo