జయహో.. కేసీఆర్

- క్షౌరశాలలు, లాండ్రీ షాపులకు, దోబీఘాట్లకు ఉచిత కరెంట్‌పై అంబురాన్నంటిన సంబురాలు
- పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- పటాకులు కాల్చి, స్వీట్లు పంచిన నాయకులు
కోరుట్ల: హైదరాబాద్‌లో టీఆర్ఎస్ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ పలు వర్గాలపై వరాలు జల్లు కురిపించడంపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నుంచి క్షౌరశాలలకు, లాండ్రీ షాపులకు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని, మార్చి నుంచి సెప్టెంబర్ దాకా వాహన పన్ను రద్దు చేస్తామని ప్రకటించడంపై ఆయా వర్గాల నాయకులు సంబురాలు చేసుకున్నారు. మంగళవారం నాయీ బ్రాహ్మణ సేవా సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నీలం మొండయ్య ఆధ్వర్యంలో సంఘ భవనంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సెలూన్లకు ఉచిత విద్యుత్ అందించి ఆర్థికంగా వెసులుబాటు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పగడాల జయరాం, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎర్రబొజ్జ నర్సయ్య, నగర అధ్యక్షు డు నాగవెల్లి రాజేశ్, నాయకులు కంది వెంకటేశ్, లక్ష్మణ్, జగదీశ్ పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చింతకుంట శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మంథనిలోని దొంతులవాడలో నాయీ బ్రాహ్మణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ సమీపంలో మంగళవారం పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లాండ్రీ షాపులు, దోబీఘాట్లకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించడంపై పటాకులు కాల్చి, స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కట్కూరి లింగయ్య, పట్టణాధ్యక్షుడు కట్కూరి గణేశ్, ఉపాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, నాయకులు చంద్రగిరి భూమయ్య, బింగిసారపు మధు, మునుగంటి గంగాధర్, గొల్లపల్లి సత్యనారాయణ, రాజేశ్ ఖన్నా, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మోటార్ వాహనాలపై పన్ను రద్దు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి జగిత్యాల కొత్త బస్టాండ్‌లో జగిత్యాల టూరిస్ట్ బస్ ఓనర్స్ అసోసియేషన్ లారీ అసోసియేషన్ సభ్యులు కొత్త బస్టాండ్‌లో సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు మాదాడి సు ధాకర్ రావు, కౌన్సిలర్ చుక్క నవీన్, రా మారావు, నాగేశ్వర్ రావు, సత్యనారాయణ రెడ్డి, వెంకటరమణ, కు సుంబ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మారిన ప్రత్యేక రైళ్ల సమయాలు
- రాధేశ్యామ్ యూనిట్‌కు ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
- పట్టు బిగిస్తున్న భారత్.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి దరఖాస్తుల స్వీకరణ
- మెట్రో వెంచర్.. ఆదాయంపై ఫోకస్
- రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్
- ముదిరాజ్‌ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
- బోగస్ గుర్తింపు కార్డులతో చిత్రపురి కాలనీలో ఫ్లాట్లు
- వివిధ కారణాలతో పలువురి ఆత్మహత్య
- సీసీ కెమెరాలు పట్టించాయి..