ట్రాఫిక్ చిక్కులకు చెక్

- జగిత్యాలలో అత్యాధునిక ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం
- రూ. 50 లక్షల టీయూఎఫ్ఐడీసీ నిధులతో ఐదు జంక్షన్లలో ఏర్పాటు
- 14 చోట్ల సోలార్ బ్లింకర్స్..
జగిత్యాల క్రైం: నాలుగేళ్ల కిందట జగిత్యాల కొత్త జిల్లాగా అవతరించింది. ఈ నేపథ్యంలో వివిధ పనుల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో బల్దియా అధికారులు అధునాతన సిగ్నలింగ్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జగిత్యాల పోలీసులు, ఆర్అండ్బీ అధికారుల స హకారంతో పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతా లు, ముఖ్యమైన కూడళ్లు, ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు. ఐదు చౌరస్తాల్ల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, 14 ప్రాంతాల్లో బ్లింకర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పాటు, నిర్వహణకు అనుభవం ఉన్న కంపెనీల నుంచి టెండర్లు కోరగా, హైదరాబాద్‌కు చెందిన ఎస్పీటీ కంపెనీ పనులను దక్కించుకుంది. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు, ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను తీసుకున్నది.
పనులు షురూ..
ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకు సెప్టెంబర్ 21న జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి పాత బస్టాండ్ చౌరస్తావద్ద భూమిపూజ చేశా రు. టెండర్లు దక్కించుకున్న ఎస్టీపీ సంస్థ మూడు రోజుల క్రితం సిగ్నళ్లను ఏర్పాటు పనులు ప్రారంభించింది. పట్టణంలోని పాత బస్టాండ్, తహసీల్, న్యూ బస్టాండ్ చౌరస్తా లు, కరీంనగర్ రోడ్డు వైపున ఉన్న చిన్న కెనాల్, జయశంకర్ విగ్రహం వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జాతీయ రహదారి 563పై కరీంనగర్ మార్గంలో జగిత్యాల పట్టణంలో డివైడర్లు ప్రారంభమయ్యే పద్మనాయక కల్యాణమండపం వద్ద ఒకటి, కలెక్టరేట్ ఎదుట ఉన్న అతిథి రెస్టారెంట్ వద్ద రెండు, బస్ డిపో వద్ద రెండు, జా తీయ రహదారి 63పై నిజామాబాద్ వైపు డివైడర్లు ప్రా రంభమయ్యే మంచినీళ్ల బావి సమీపంలో ఒకటి, మంచినీల్ల బావి వద్ద రెండు, ధర్మపురి వైపు సీఎస్ఐ చర్చి వద్ద రెండు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద రెండు, బైపాస్ రోడ్ జంక్షన్ రాజీవ్ విగ్రహం వద్ద రెండు చొప్పున మొత్తం 14 బ్లింకర్లను ఏర్పాటు చేస్తున్నారు.
వైర్లెస్ విధానం..
ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టంను వైర్లెస్ విధానంలో ఏర్పా టు చేయనున్నారు. పట్టణానికి నాలుగు మార్గాల గుండా వచ్చే వాహనాలకు అనుగుణంగా లైట్లు ఎంత సమయం ఉం డాలో మార్చుకునే విధంగా పరికరాలను అమరుస్తున్నా రు. ఒక్కో చౌరస్తా వద్ద రెండు నుంచి నాలుగు నిమిషాలు పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. 30 నుంచి 35 సెకన్లు ఉండేలా టైమ్ సెట్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సందర్భాల్లో సిగ్నల్ టైమింగ్‌ను నిమిషం నుంచి నిమిషంన్నర వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక మార్గంలో వచ్చే రద్దీకి అనుగుణంగా మరో వైపు ఉన్న చౌరస్తాల్లో ఉండే సిగ్నల్లు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీటీ కంపెనీ ప్రతినిధులు బెబుతున్నారు. పట్టణంలో అమర్చిన 14 బ్లింకర్లు సోలార్ ప్యానెల్ ద్వారా నిరంతరం పనిచేయనున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్స్, బ్లింకర్స్ ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తీరనున్న ఇబ్బందులు..
పట్టణంలో అధునాతన ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటుతో ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయని పట్టణవాసులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాకేంద్రంగా ఏర్పాటైన తర్వాత జిల్లా నలు మూలల నుంచి నిత్యం 40 వేల నుంచి 50 వేల వాహనాలు వచ్చి పోతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు సాంకేతిక నియంత్రణ లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా నడిపేవారని, సిగ్నళ్ల ఏర్పాటుతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..