శనివారం 28 నవంబర్ 2020
Jagityal - Nov 22, 2020 , 02:19:45

ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలి

ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలి

  • ఇన్‌చార్జి ఆర్డీవో వినోద్‌కుమార్‌
  • వేంపేటలో ఓటరు నమోదు కేంద్రం తనిఖీ

మెట్‌పల్లి రూరల్‌: ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలని మెట్‌పల్లి ఇన్‌చార్జి ఆర్డీవో వినోద్‌కుమార్‌ తెలిపారు. వేంపేటలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 18 సంవత్సరాలు నిండినవారిని ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని బీఎల్వోలకు సూచించారు. ఆదివారంతో పాటు వచ్చేనెల 5, 6వ తేదీల్లో శిబిరాలు కొనసాగుతాయని తెలిపారు. కాగా, మండలంలో 84 పోలింగ్‌ కేంద్రాలకు 102 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌ రాజేశ్‌ తెలిపారు. 

మల్లాపూర్‌: మండలంలోని సిరిపూర్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్‌ రమేశ్‌ మాట్లాడుతూ..  18 ఏండ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సర్పంచ్‌ భూక్య గోవింద్‌నాయక్‌, ఆర్‌ఐ గంగాధర్‌, కార్యదర్శి ముజీబ్‌, అంగన్‌వాడీ టీచర్‌ రాధ తదితరులు పాల్గొన్నారు. 

పెగడపల్లి: మండలంలోని పెగడపల్లి, ఎల్లాపూర్‌, నామాపూర్‌, కీచులాటపల్లి, రాజరాంపల్లి గ్రామాల్లోని ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాలను తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి పరిశీలించారు. అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 22, డిసెంబర్‌ నెల 5, 6 తేదీల్లో ఓటరు నమోదుకు బీఎల్వోలు అందుబాటులో ఉంటారని, వినియోగించుకోవాలని సూచించారు. ఆర్‌ఐ శరత్‌, అనిల్‌, బీఎల్వోలు పాల్గొన్నారు.