కరోనాతో గత ఏడాది అందరి పరిస్థితి దుర్భరంగా మారింది. 2020 చివరలో కాస్త కరోనా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాని మళ్లీ ఉప్పెనలా విజృంభించడంతో పిట్టల్లా రాలిపోతున్నారు. కొందరి పరిస్తితి దుర్భరంగా మారింది. లాక్డౌన్ వలన తినడానికి తిండి కూడా కరువైంది. ఇలాంటి పరిస్థితులలో సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
కరోనా వలన సినిమా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో డ్యాన్సర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ డాన్సర్స్కు నిత్యావసర వస్తువులు అందచేస్తున్నారు. సినిమా, షోస్ చేసే డాన్సర్స్ ఎవరికైనా నిత్యావసర వస్తువులు అవసరమైతే, 9989189885, 9618961492, 7416519257 నెంబర్స్కు ఫోన్ చేసి తీసుకోవచ్చునని తెలియజేస్తూ శేఖర్ మాస్టర్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తుంది.