ఆదివారం 24 జనవరి 2021
Jagityal - Nov 11, 2020 , 01:27:44

ఉప ఎన్నికలో విజయంపై సంబురాలు

ఉప ఎన్నికలో విజయంపై సంబురాలు

జగిత్యాల టౌన్‌: దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందడంపై మంగళవారం జిల్లా కేంద్రంలోని తహసీల్‌చౌరస్తా వద్ద నియోజకవర్గ ఇన్‌చార్జి ముదుగంటి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకొన్నారు. నాయకులు ఏసీఎస్‌ రాజు, అరవ లక్ష్మి, అనిల్‌కుమార్‌, గుర్రం రాము, మ్యాన మహేశ్‌, పులి శ్రీధర్‌, మదిపేటి మల్లేశం, బడే శంకర్‌, సురేశ్‌, సతీశ్‌, బిట్టు తదితరులు పాల్గొన్నారు. 

సారంగాపూర్‌: సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లో బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. పార్టీ మండలాధ్యక్షులు ఎండబెట్ల వరుణ్‌కుమార్‌, సీపతి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మెట్‌పల్లి రూరల్‌: జగ్గసాగర్‌లో పటాకులు కా ల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు కొమ్ముల రాజ్‌పాల్‌రెడ్డి తదితరులున్నారు.


logo