బుధవారం 25 నవంబర్ 2020
Jagityal - Oct 31, 2020 , 00:45:45

బతుకు బాటలో గల్ఫ్‌కు..విగతజీవిగా ఇంటికి

బతుకు బాటలో గల్ఫ్‌కు..విగతజీవిగా ఇంటికి

కోరుట్ల రూరల్‌: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ వ్యక్తి రెండు నెలల కిందట అనారోగ్యంతో మరణించాడు.  శుక్రవారం సొంతూరికి మృతదేహం చేరడంతో భార్యాబిడ్డలు బోరుమన్నా రు. మండలంలోని ఏకీన్‌పూర్‌ గ్రామానికి చెందిన బైర రాజమల్లయ్య (58) 40 ఏళ్లుగా సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు.  అక్కడి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆగస్టు 30న అ నారోగ్యం తో మృతి చెందాడు.  స్నేహితులు గ్రామంలోని కు టుంబసభ్యులకు సమా చారం అందించారు.  అయితే  రాజమల్లయ్యకు అలియాస్‌ అబ్దుల్‌ రహమాన్‌ అని రెండు పేర్లు ఉండడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు సౌదీ ప్రభుత్వం నిరాకరించింది. నెల కిందట మృతుడి భార్య రాజమల్లక్క,  తన భర్త మృతదేహాన్ని తెప్పించాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవికి  విన్నవించింది. కలెక్టర్‌ స్పం దించి అక్కడి అధికారులతో మాట్లాడడంతో మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు అంగీకరించారు.  కాగా  గురువారం రా జమల్లయ్య మృతదేహాం సొంతూరికి  రావడంతో కుటుంబ సభ్యులు  శవపేటికపై పడి గుండెలు బాదుకున్నారు.