శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 28, 2020 , 01:11:45

సీఎంఆర్‌ఎఫ్‌ పేదల పాలిట వరం

సీఎంఆర్‌ఎఫ్‌ పేదల పాలిట వరం

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

లబ్ధిదారుకు చెక్కు అందజేత

జగిత్యాల రూరల్‌: సహాయ నిధి పేదల పాలిట వరమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. రూరల్‌ మండలం కల్లెడ గ్రామానికి చెందిన రాజేశ్వరికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.60వేల చెక్కును జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే బాధితులకు ఆర్థికసాయం అందుతుందన్నారు. ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, సర్పంచ్‌ జోగినపల్లి మహేశ్వర్‌రావు, తదితరులున్నారు. 

బాధిత కుటుంబానికి పరామర్శ

జగిత్యాల అర్బన్‌ మండలం హస్నాబాద్‌కు చెందిన చింతనూరి రాజ్‌కుమార్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకోగా, అతడి కుటుంబ సభ్యులను జిల్లా ప్రధాన వైద్యశాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరామర్శించారు. ఆయన వెంట నాయకులు లక్ష్మణ్‌రావు, ఆనందరావు, పురుషోత్తంరావు తదితరులున్నారు. 

సన్నరకానికి మద్దతు ధర పెంచాలని వినతి

సన్నరకం ధాన్యానికి మద్దతు దర పెంచాలని నియోజకవర్గంలోని ప్యాక్స్‌ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచన మేరకు నియంత్రిత సాగులో భాగంగా నియోజకవర్గ రైతులు సన్నరకం వరి అధిక విస్తీర్ణంలో సాగు చేశారని తెలిపారు. కానీ, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,868 రైతులకు గిట్టుబాటు కావడంలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సమస్య విన్నవించి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలని కోరారు. జగిత్యాల, రాయికల్‌ ఏఎంసీ చైర్మన్లు కొలుగూరి దామోదర్‌రావు, గన్నె రాజిరెడ్డి, విండో చైర్మన్లు పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, రాజలింగం, రాజారెడ్డి, జోగినపల్లి సందీప్‌రావు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.