శనివారం 05 డిసెంబర్ 2020
Jagityal - Oct 27, 2020 , 05:33:04

దసరా వేడుకల్లో అపశృతి

దసరా వేడుకల్లో అపశృతి

జగిత్యాల క్రైం: విజయదశమి వేడుకల్లో అపశృతి దొర్లింది. మహిశాసుర సంహారం కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తికి నిప్పంటుకున్నది. జిల్లా కేంద్రంలోని బీట్‌ బజార్‌ వద్ద మహిశాసుర సంహారం కార్యక్రమం విషయంలో రెండు వర్గాలకు గొడవ జరిగింది. మహిశాసురుడికి నిప్పుపెట్టేందుకు భవానీ దీక్ష స్వీకరించిన యశ్వంత్‌ మహిశాసురిడి ప్రతిమపై పెట్రోల్‌ పోస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మహిశాప్రతిమపై నిప్పు విసిరాడు. దీంతో పెట్రోల్‌ పోస్తున్న యశ్వంత్‌కూ మంటలంటుకున్నాయి. గమనించిన పోలీసులు, స్థానికులు యశ్వంత్‌ షర్ట్‌ విప్పగా స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు.