శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 27, 2020 , 05:33:03

‘సద్దుల’ సంబురాలు

‘సద్దుల’ సంబురాలు

  • బతుకమ్మ ఆడిన మహిళలు, యువతులు
  • చెరువులు, కుంటల్లో నిమజ్జనం 

నమస్తే నెట్‌వర్క్‌, జగిత్యాల: జగిత్యాల అర్బన్‌, రూరల్‌ మండలాల్లో హస్నాబాద్‌, చల్‌గల్‌, కన్నాపూర్‌, తాటిపల్లి, వెల్దుర్తి గ్రామాల్లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. ఆలయాలు, ప్రధాన కూడళ్లలో బతుకమ్మ ఆడారు. అనంతరం చెరువులు, కుంట లు, కాలువల్లో నిమజ్జనం చేశారు. ఆయా గ్రామా ల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.  మల్యాల మండలంలోని పోతారంలో వేడుకలు జరుపుకొన్నారు.  సారంగాపూర్‌ మండలం లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల, కోనాపూర్‌, పోచంపేట, నాగునూర్‌, లచ్చక్కపేట, రంగపేట, అర్పల్లి, బీర్‌పూర్‌ మండలం కమ్మునూర్‌, చిత్రవేణి గూడెం, మంగెళ తదితర గ్రామాల్లోనూ సద్దుల సంబురాలు జరుపుకొన్నారు.

మహిళలంతా ఆడిపాడి అనంతరం బతుకమ్మలను సమీప చెరువులు, కుంటలు, కా లువల్లో నిమజ్జనం చేశారు. ఎంపీపీ కోల జమున, వైస్‌ ఎంపీపీలు సొల్లు సురేందర్‌, బల్మూరి లక్ష్మణ్‌రావు, జడ్పీటీసీ పాత పద్మ, విండో చైర్మన్లు గురునాథం మల్లారెడ్డి, ఏలేటి నర్సింహారెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు సయ్యద్‌ అమీర్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు లక్ష్మి, జమున, రాజన్న, రమేశ్‌, జమున, విమల, వెంకటేశ్‌, గంగు, వెంకటరమణారావు, శ్రీలత, శారద, మరియా, సుగుణ, రమేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. మెట్‌పల్లి పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు, మున్సిప ల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌, నాయకులు తదితరులున్నారు. రాయికల్‌, మల్లాపూర్‌, కథలాపూర్‌ మండలాల్లో సంబురాలు జరుపుకొన్నారు. మల్లాపూర్‌ మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కదుర్క నర్సయ్య పాల్గొన్నారు. కోరుట్ల మండలం అయిలాపూర్‌, నాగులపేట, చిన్నమెట్‌పల్లి, జోగిన్‌పల్లి, సంగెం, మాదాపూర్‌ తదితర గ్రామాల్లో మహిళలు బతుకమ్మలను అందంగా పేర్చి ఆడిపాడారు.

అనంతరం శోభాయాత్రగా వెళ్లి చెరువులు, కుంటలు, వాగుల్లో నిమజ్జనం చేశారు. మేడిపల్లి పోరుమల్ల, తొంబర్‌రావుపేట, వల్లంపల్లి, భీమారం, దమ్మన్నపేట, లింగంపేట, మన్నెగూడెం తదితర గ్రామాల్లో వేడుకలు జరుపుకోగా, ఎంపీపీ దొనకంటి ఉమాదేవి, సర్పంచులు వంగ వెంకటేశం, సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, తౌటి తిరుపతిరెడ్డి, కాచర్ల సురేశ్‌, వెల్మ సమత, మామి డి సత్తెమ్మ, చెక్కపెల్లి అరుణ తదితరులున్నారు. ధర్మపురి పట్టణంలోని బోయవాడ, మండలంలోని రాజారం, జైన, ఆరెపల్లి గ్రామాల్లో వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. వేడుకల్లో రైతుబంధు సమితి కన్వీనర్‌ సౌళ్ల భీమయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ సౌళ్ల నరేశ్‌, సర్పంచులు రంగు మమత, బోర్లకుంట కమల, ప్రభాకర్‌రావు, ఎం పీటీసీలు సౌళ్ల సత్తెవ్వ, రజిత తదితరులున్నారు.