శుక్రవారం 04 డిసెంబర్ 2020
Jagityal - Oct 27, 2020 , 05:15:19

బాలికపై లైంగిక దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌

బాలికపై లైంగిక దాడి కేసులో ఐదుగురి అరెస్ట్‌

  • వివరాలు వెల్లడించిన డీఎస్పీ గౌస్‌బాబా 

మెట్‌పల్లి: పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఐదుగురు యువకులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. మెట్‌పల్లి డీఎస్పీ గౌస్‌బాబా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన లోకిని రాజేశ్‌ రెండేళ్ల కిందట సదరు బాలిక బాత్రూంలో స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి, వాటిని ఆమెకు చూపించి కామవాంఛ తీర్చాలని వేధించాడు.

లేకుంటే వాటిని కుటుంబసభ్యులకు, ఇతరులకు చూపిస్తానని బెదిరించి లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి బాలికపై పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సుమారు20 రోజుల కిందట ఎప్పటిలాగే బాలికకు ఫోన్‌ చేసి కాలనీ సమీపంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వెనుకాల గల గోడవద్దకు రమ్మని పిలిచాడు. అతనితో పాటు స్నేహితులు దారంగుల సాయికుమార్‌, మొగిలిపాక అనిల్‌కుమార్‌, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్‌ అక్కడికి చేరుకున్నారు. రాజేశ్‌ ఆమె కలిసి ఉండగా వీడియో తీసి, అది చూపి బెదిరించి మిగతా నలుగురూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇది కూడా సెల్‌ఫోన్‌లో వీడియో తీసి కొందరికి వాట్సాప్‌లో పంపి వైరల్‌ చేశారు. ఆనోటా, ఈనోటా బాధితురాలి కుటుంబసభ్యులకు తెలియడంతో ఈ నెల 24న పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు దర్యాప్తు చేపట్టి, సోమవారం ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, రెండు మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ వివరించారు.