గురువారం 03 డిసెంబర్ 2020
Jagityal - Oct 25, 2020 , 04:55:27

మక్క రైతుల ఆనందహేల

మక్క రైతుల ఆనందహేల

ఊరూరా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం 

మెట్‌పల్లి: మక్కల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతుల్లో ఆనందోత్సాహం నెలకొంది. క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధరతో రైతుల నుంచి నేరుగా సేకరించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఇంత మంచి నిర్ణయం తీసుకుని రైతు పక్షపాతి అని మరోసా రి చాటి చెప్పింది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో మక్కలను కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడంతో శనివారం జిల్లా రైతులు సంబురాలు చేసుకున్నారు. ఊరూరా రైతులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. 

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు ఎల్లాల తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ నోముల ల క్ష్మారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పొన్‌కంటి వెం కట్‌, ఎంపీటీసీలు చిన్నారెడ్డి, రాములు, జలేశ్‌, విండో చైర్మన్లు గోపి, శ్రవణ్‌, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సుగుణాకర్‌రావు, నాయకులు రమేశ్‌, జగన్‌రా వు, సత్యనారాయణ, జేడీ సుమన్‌, ప్రదీప్‌, పాపన్న, రాజిరెడ్డి, పవన్‌, దేవేందర్‌, పురుషోత్తం, సాగర్‌, భూ మేశ్వర్‌, మోహన్‌, ఆనంద్‌, జీవన్‌ పాల్గొన్నారు.    

మల్లాపూర్‌: మండల కేంద్రంతో పాటు, సిరిపూర్‌, వాల్గొండ, చిట్టాపూర్‌ గ్రామాల్లో సీఎం కేసీఆర్‌, ఎమ్మె ల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు తోట శ్రీనివాస్‌, కదుర్క నర్సయ్య, బద్ధం అంజిరెడ్డి, నేరెళ్ల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల రూరల్‌: రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స ర్పంచ్‌ చెరుకు జాన్‌,  నాయకులు రాజిరెడ్డి, గంగారెడ్డి, చంద్రారెడ్డి, జనార్దన్‌, స్వామిరెడ్డి పాల్గొన్నారు.   

కథలాపూర్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు పాలాభిషేకం చేశారు. ఎంపీటీసీ కొండ ఆంజనేయులు, నాయకులు కూన శ్రీనివాస్‌, ప్రిన్స్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, గంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, మహేందర్‌, శ్రీనివాస్‌రెడ్డి, దేవారెడ్డి, సంతోష్‌రెడ్డి, రాకేశ్‌, అంజయ్య, పుల్లారెడ్డి తదితరులున్నారు.

మెట్‌పల్లి రూరల్‌: ఆత్మకూర్‌, వేంపేట, రాజేశ్వర్‌రావుపేట కేసీఆర్‌, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పుల్ల చంద్రశేఖర్‌గౌడ్‌, నల్ల తిరుపతిరెడ్డి, నలిమెల అంజిరెడ్డి, కేశిరెడ్డి నవీన్‌రెడ్డి, నేరెళ్ల శ్రీధర్‌, నందగిరి రాజశేఖర్‌, గుండెల అంజయ్య, కసాడి తిరుపతి, పుప్పాల రాజేందర్‌, సత్యనారాయణ, గంగభూములు, కాట శ్రీధర్‌, గణేశ్‌, గంగాధర్‌, సుదర్శన్‌, లక్ష్మణ్‌, రైతులు పాల్గొన్నారు.

రాయికల్‌ రూరల్‌: మండల వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, ఎంపీపీ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్‌ గన్నె రాజిరెడ్డి, ఎంపీటీసీ దొంతి నాగరాజు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్‌, నాయకులు రాజేశ్‌, తిరుపతిగౌడ్‌, రామ్మూర్తి, హూస్సేన్‌, సత్యనారాయణ, ప్రసాద్‌ పాల్గొన్నారు.