సోమవారం 30 నవంబర్ 2020
Jagityal - Oct 25, 2020 , 04:55:26

మక్కలకు మద్దతు ధర ప్రకటనపై హర్షం

మక్కలకు మద్దతు ధర ప్రకటనపై హర్షం

జగిత్యాల రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మక్కల రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1850 మద్దతు ధర చెల్లించి మార్క్‌పెడ్‌ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివసాయి రెసిడెన్సియల్‌ హోటల్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం అనుమతితో సన్న రకాలు సాగు చేసిన రైతులకు రూ.2,500 మద్దతు ధర చెల్లించి న్యాయం చేయాలన్నారు. నాయకులు మామిడి నారాయణరెడ్డి, చింతలపెల్లి గంగారెడ్డి, సామ భాస్కర్‌రెడ్డి, బందెల మల్లయ్య, గంగారెడ్డి, రాంరెడ్డి తదితరులున్నారు.