శుక్రవారం 27 నవంబర్ 2020
Jagityal - Oct 25, 2020 , 04:38:26

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌

రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రభుత్వాన్ని విమర్శించే  హక్కు  ప్రతిపక్షాలకు లేదు   

ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ 

జగిత్యాల రూరల్‌: రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని, అనేక పథకాలతో అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదని దుయ్యబట్టారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మక్క రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ధర్నాలకు ప్రోత్సహించడం సరికాదన్నారు. గతేడాది రైతుల వద్ద మక్కలు కొని రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిందని, అయినప్పటికీ ఈ యేడు ఏ ఒక్క రైతు బాధపడవద్దనే ఉద్దేశంతోనే మళ్లీ కొనుగోలు చేస్తున్నదని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, పంటలకు పెట్టుబడి సాయంతో రాష్ట్రంలో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నదని, గతంలో 70లక్షల ఎకరాల్లో సాగైతే, ప్రస్తుతం 1.40కోట్లకు చేరుకుందని వివరించా రు. ఆయకట్టు ప్రాంతమైన జగిత్యాల జిల్లాలోనే 25శాతం అధికంగా సాగైనట్లు చెప్పారు. సాగుకు సమృద్ధిగా నీరు, రైతన్నకు దీమా ఇస్తుండడం వల్లే తెలంగాణ ధాన్యభాండాగారంగా మారుతున్నదని పునరుద్ఘాటించారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వర కు పంట కొనుగోళ్లు 6రెట్లు పెరిగిందని, గతంలో రూ.360కోట్ల విలువైన మక్కలు కొనుగోలు చేస్తే, 2019-20లో రూ. 1672కోట్ల విలువైన మక్కలను కొనుగోలు చేసిందన్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్ర సర్కారు రూ.845 కోట్లు నష్టపోయినప్పటికీ రైతులకు ఎక్కడా ఇబ్బందిరాలేదని చెప్పారు. ఈ యేడు మక్క సాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా రైతులు వేశారని, ఇబ్బందులు పెట్టవద్దనే ఉద్దేశంతో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారన్నారు. ఈ సందర్భంగా రైతుల తరఫున కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మక్క రైతుల కోసం మాట్లాడుతున్న ఎంపీ అరవింద్‌ పసు పు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌ రాసిచ్చిన విషయాన్ని మరిచిపోయినట్లున్నారని, దానిపై సమాధానం చెప్పాకనే మాట్లాడాల ని సవాల్‌ విసిరారు. ఇక్కడ రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్‌ రావు, ఏఎంసీ చైర్మెన్‌ కొలుగూరి దామోధర్‌ రావు, జగిత్యాల, కల్లెడ సింగిల్‌ విండో చైర్మన్లు పత్తిరెడ్డి మైపాల్‌ రెడ్డి, సం దీప్‌రావు, రైతు బంధు మండల జిల్లా కోఆర్డినేటర్లు రవీందర్‌ రెడ్డి, శంకర్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ముకుందం ఉన్నారు.