బుధవారం 02 డిసెంబర్ 2020
Jagityal - Oct 23, 2020 , 05:04:06

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలి

జగిత్యాల: ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, మెరిట్‌ కమ్‌మీన్స్‌ కేటగిరీల కింద అందిస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి వరదరాజన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కనీసం 50 శాతం మార్కులు పొందాలన్న నిబంధనకు కొవిడ్‌-19 నేపథ్యంలో మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్‌ఐసీ పోర్టల్‌లోనూ రెన్యూవల్‌ కోసం మార్పులు చేశారని తెలిపారు.  

ప్రవేశ పరీక్ష వాయిదా..

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా సివిల్‌ సర్వీసెస్‌ కోచింగ్‌ కోసం శుక్రవారం నిర్వహించే CSAT ప్రవేశ పరీక్ష వాయిదా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ తెలిపారని వరదరాజన్‌ పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష ఎప్పుడు నిర్వహించేది అభ్యర్థులకు తెలియజేస్తామని వివరించారు.