బుధవారం 02 డిసెంబర్ 2020
Jagityal - Oct 22, 2020 , 02:55:09

దసరా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

దసరా వరకు రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలి

జగిత్యాల కలెక్టర్‌ గగులోతు రవి

పెగడపల్లి: రైతు వేదికల నిర్మాణ పనులు దసరాలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గగులోతు రవి ఆదేశించారు. బుధవారం పెగడపల్లి మండలం నంచర్ల, ఎల్లాపూర్‌లో రైతు వేదికల నిర్మాణ పనులను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నంచర్ల రైతు వేదిక నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇక్కడే ఉండి పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని ఆదేశించారు. ఎల్లాపూర్‌లో పనులు ముమ్మరంగా సాగుతుందడడంతో రెండు రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. దసరా రోజున రైతు వేదికలు ప్రారంభించేలా సిద్ధ్దం చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, నంచర్ల విండో చైర్మన్‌ మంత్రి వేణుగోపాల్‌, సర్పంచులు గోలి మహేందర్‌రెడ్డి, ముద్దం అంజమ్మ, గిర్దావర్‌ అనిల్‌, పంచాయతీ కార్యదర్శి శివపాల్‌సింగ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ముద్దం మల్లేశం తదితరులున్నారు.

వెల్గటూర్‌: రైతు వేదికలను దసరా వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ రవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని గుల్లకోట, గొడిసెలపేట, కొత్తపేట, చేగ్యాం, వెల్గటూర్‌లో నిర్మిస్తున్న రైతు వేదికల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. పీఆర్‌ ఈఈ రహ్మాన్‌, ప్రత్యేకాధికారి నరేశ్‌, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీడీవో సంజీవరావు, సర్పంచులు పొన్నం స్వరూపాతిరుపతి, స్వామి, లావణ్య, రాంబాబు  పాల్గొన్నారు.