గురువారం 26 నవంబర్ 2020
Jagityal - Oct 21, 2020 , 01:50:12

ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నగేశ్‌

ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నగేశ్‌

జగిత్యాల: ఎంపీటీసీల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మెట్‌పల్లి మండలం మేడిపల్లి ఎంపీటీసీ సభ్యుడు గుండెల నగేశ్‌ ఎన్నికయ్యారు. జగిత్యాలలో ఎంపీటీసీ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జిల్లా సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా శోభ, సురేందర్‌, ప్రధాన కార్యదర్శిగా గున్నాల శ్రీనివాస్‌ను ఎన్నుకోగా, గౌరవాధ్యక్షుడిగా రాయికల్‌ మండలం కుమ్మరిపెల్లి ఎంపీటీసీ సభ్యుడు నాగరాజును ఎన్నికయ్యారు. వీరికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్‌గౌడ్‌ నియామక పత్రాలను అందజేశారు. ఎంపీటీసీల సంక్షేమానికి జిల్లా కార్యవర్గం పాటుపడాలని సూచించారు.