మంగళవారం 27 అక్టోబర్ 2020
Jagityal - Oct 19, 2020 , 03:36:56

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని పూజలు

ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని పూజలు

రాయికల్‌: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ క్రిస్టియన్‌ అసోసియేషన్‌ మండలాధ్యక్షుడు దూలూరి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. అలాగే అల్లీపూర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జడ్పీటీసీ జాదవ్‌ అశ్విని, సర్పంచ్‌ అత్తినేని గంగారెడ్డి తదితరులు పూ జలు నిర్వహించారు. పాస్టర్లు హోనోక్‌, బర్నబా, కాబులు, జెకార్య, దేవయ్య, ప్రభాకర్‌, ఎలియాజర్‌ పాల్గొన్నారు.

సారంగాపూర్‌: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోలుకోవాలని అర్పల్లిలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్పంచ్‌ కొండ శ్రీలత, నాయకులు ఎండబెట్ల ప్రసాద్‌, కొండ ప్రభాకర్‌, గంగారాం, కృష్ణవేణి, పాస్టర్‌ పాల్గొన్నారు.


logo