శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jagityal - Oct 18, 2020 , 03:30:01

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

మెట్‌పల్లి: దసరా ఉత్సవాల ఏర్పాట్లపై  పట్టణంలోని చెన్నకేశవనాథస్వామి ఆలయ ఆవరణలో కుల సంఘాలు, వార్డు ప్రతినిధులతో శనివారం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలు, మంగళహారతి నిర్వహించాలని ప్రతిపాదనలు రాగా ఏకగ్రీవంగా సమ్మతించారు. ఉత్సవాలను ఆలయం వద్ద జరుపుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.  అనంతరం ఏర్పాట్లపై చర్చించారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు రాణవేని సుజాత, ఉపాధ్యక్షుడు బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, నాయకులు, సంజీవ్‌, నర్సింలు, సహదేవ్‌, రాజేశ్వర్‌గౌడ్‌, బుచ్చిరెడ్డి, రమేశ్‌, రాజారాం తదితరులున్నారు.  

ఎమ్మెల్యే కల్వకుంట్లకు సన్మానం

మెట్‌పల్లి టౌన్‌: మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌గా నియమితులైన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావును పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు సన్మానించారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. నాయకులు గోపిడి జీవన్‌రెడ్డి, ఏలేటి సంతోష్‌రెడ్డి, మ్యాడారపు రాజేశ్‌రెడ్డి, ఏలేటి శ్రావణ్‌రెడ్డి, కొమ్ముల జీవన్‌రెడ్డి, ఆదిరెడ్డి తదితరులున్నారు. 


logo