శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Oct 18, 2020 , 03:28:01

ఎమ్మెల్యే కోలుకోవాలని పాదయాత్ర

ఎమ్మెల్యే కోలుకోవాలని పాదయాత్ర

ఆలయాల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకుల పూజలు

జగిత్యాల రూరల్‌: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లా కేంద్రంలోని తులసీనగర్‌ నుంచి కొండగట్టు వరకు 25, 23వ వార్డుల కౌన్సిలర్లు ఆరుముల్ల నర్సమ్మ, జుంబర్తి రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. అంజన్న ఆలయంలో పూజలు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, నాయకుడు బోయినపల్లి ప్రశాంత్‌రావు పాదయాత్రను ప్రారంభించారు. నాయకులు పవన్‌, రమేశ్‌, రాకే శ్‌, కళ్యాణ్‌, రాకేశ్‌, అంకిత్‌, నరేశ్‌, ప్రశాంత్‌, కార్తి క్‌, గిరీశ్‌, అభి, గణేశ్‌, లక్ష్మణ్‌, ఉదయ్‌, ధర్మయ్య, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే అర్బన్‌ మండలంలోని అంబర్‌పేట వేంకటేశ్వరస్వామి, జగిత్యాలలోని అయ్యప్ప, వాణీనగర్‌లోని శ్రీ రాజాజేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. సర్పంచులు గొడిశెల గంగాధర్‌గౌడ్‌, జోగినపల్లి మహేశ్వర్‌రావు, చెరుకు ఆజన్‌, బోనగిరి నారాయణ, ప్రవీణ్‌గౌడ్‌, దామోదర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బాలముకుందం, నాయకులు సతీశ్‌, రాజన్న, రాము, ఆనందరావు, విజయ్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులున్నారు. 

సారంగాపూర్‌: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మండలంలోని పెంబట్ల దుబ్బ రాజేశ్వరస్వామి, బీర్‌పూర్‌ మండలం కొల్వాయి సీతారామాలయంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కోల జమున, జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సొల్లు సురేందర్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ అమీర్‌, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ కోల శ్రీనివాస్‌, విండో చైర్మన్‌ గురునాథం మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, నారపాక రమేశ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు సుధాకర్‌రావు, ఏసుదాసు, తిరుపతి, శేఖర్‌గౌడ్‌, రాజిరెడ్డి, రాజేందర్‌, కిషన్‌, శ్రీనివాస్‌, లింగన్న, గంగాధర్‌, మల్లేశం, సురేశ్‌, రమేశ్‌, సతీశ్‌గౌడ్‌, అశోక్‌ పాల్గొన్నారు.  

రాయికల్‌ రూరల్‌: ఇటిక్యాల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ సంధ్యారాణి, ఎంపీటీసీలు, సర్పంచులు ఎమ్మెల్యే సంజయ్‌ పేరున అర్చన చేయించారు. రాయికల్‌ హనుమాన్‌ ఆలయంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో పూజలు చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు అనుమల్ల సత్యనారాయణ 101 కొబ్బరి కాయలు కొట్టాడు. మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ చైర్‌పర్సన్‌ గండ్ర రమాదేవి, విండో అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి, ఏఎం సీ చైర్మన్‌ రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కొల్లూరి వేణు, ఎంపీటీసీలు మోర విజయలక్ష్మి, మందుల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, మహేందర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్‌, నా యకులు రాజేశ్‌, అనిల్‌, సత్యనారాయణ, సురేందర్‌నాయక్‌, రాధ, ఉదయశ్రీ తదితరులున్నారు.

జగిత్యాల టవర్‌ సర్కిల్‌: ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోలుకోవాలని ధర్మశాల ఆంజనేయస్వామి, శ్రీనివాసాంజనేయ భవానీ శంకర దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జీఆర్‌ దేశాయి, నాయకులు కొక్కుల అంజయ్య, మంచాల రాంగోపాల్‌, క్యాదాసు నాగయ్య, బొడ్ల జగదీశ్‌, రాచకొండ ప్రణీత, విజయ్‌, చంద్రమౌళి, ఈశ్వర్‌, విశ్వనాథం, మహేశ్‌, శ్రీనివాస్‌, కృష్ణ, సంతోష్‌, రఘు తదితరులు పాల్గొన్నారు.