శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Oct 18, 2020 , 03:20:56

రైతుల ముసుగులో దాడి దుర్మార్గం

రైతుల ముసుగులో దాడి దుర్మార్గం

ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి టౌన్‌: బీజేపీ నాయకులు రైతుల ముసుగులో తన ఇంటిపై దాడిచేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఖండించారు. శనివారం పట్టణంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ సర్కారు  రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక పథకాలను అమలు చేస్తూ అండగా ఉంటున్నదని చెప్పారు. కరోనా కష్టకాలంలో ఎక్కడా ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిందని చెప్పారు. ధర్నాల పేరిట బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రైతుల ముసుగులో చేసిన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మక్కలకు మద్దతు ధర నిర్ణయించడం కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని విమర్శించారు. రాబోయే కాలంలో చి క్కులు తప్పవని సూచించారు. ఇక్కడ టీ ఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాసరెడ్డి, మారు సాయిరెడ్డి, చంద్రశేఖర్‌రావు ఉన్నారు.