గురువారం 22 అక్టోబర్ 2020
Jagityal - Oct 18, 2020 , 03:12:13

మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ

మహిళలకు బతుకమ్మ చీరెల పంపిణీ

జగిత్యాల అర్బన్‌: జగిత్యాల పట్టణంలోని 21,37, 42,43,44 వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి మహిళలకు శనివారం బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు అల్లె గంగాసాగర్‌, ఫర్మీన్‌ సుల్తాన్‌, ఫిర్దోస్‌ తరున్నం, కో ఆప్షన్‌ సభ్యుడు రిజాయొద్దీన్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ మోహసీన్‌, నాయకులు ముఖేశ్‌ఖన్నా, ఆడెపు సత్యనారాయణ, ముఖీమ్‌, కూతురు శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

జగిత్యాల లీగల్‌: జగిత్యాల పట్టణంలోని 34వ వార్డులో కౌన్సిలర్‌ పిట్ట ధర్మరాజు మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అంగన్‌వాడీ టీచర్‌ పుప్పాల భాగ్య, మెప్మా రిసోర్స్‌పర్సన్‌ పెరుగ భాగ్యలక్ష్మి తదితరులున్నారు. 

మెట్‌పల్లి టౌన్‌: పట్ణణంలోని 18,19, 26 వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాణవేని సుజాత చీరెలు పంపిణీ చేశారు. కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి చంద్రశేఖర్‌రావు, కౌన్సిలర్లు చెట్లపల్లి మీనా, చర్లపల్లి లక్ష్మి, కోఆప్షన్‌ సభ్యుడు ఏశాల రాజశేఖర్‌, నాయకులు సత్యనారాయణ, రాజేశ్వర్‌గౌడ్‌ తదితరులున్నారు. 

సారంగాపూర్‌: బీర్‌పూర్‌ మండలం నర్సింహులపల్లిలో సర్పంచ్‌ రిక్కల ప్రభాకర్‌ బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.  సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో చీరెలు పంపిణీ చేయగా, ఎంపీటీసీ ఎడ్ల సృజన, ఉప సర్పంచ్‌ ఆవునూరి సత్తెమ్మ, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ మెరుగు రాజేశం తదితరులు పాల్గొన్నారు.

రాయికల్‌: కొండాపూర్‌లో ఎంపీపీ సంధ్యారాణి బతుకమ్మ చీరెల పంపిణీని ప్రారంభించారు. సర్పంచ్‌ రాజ్యలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్‌, నాయకులు వేణు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 మల్లాపూర్‌: మల్లాపూర్‌, కొత్తదాంరాజ్‌పల్లి తదితర గ్రామాల్లో బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కాటిపల్లి సరోజన, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ కదుర్క నర్సయ్య, ఎంపీడీవో కోటేశ్వర్‌రావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

కోరుట్ల రూరల్‌: జోగిన్‌పల్లిలో జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. యూసుఫ్‌నగర్‌లో సర్పంచ్‌ గుగ్గిల్ల తుక్కారాంగౌడ్‌ చీర అందజేశారు. సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌, సర్పంచ్‌ దుంపల నర్సు, నాయకులు తిరుపతిరెడ్డి, రాజు, ప్రియాంక, బల్వంతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మెట్‌పల్లి రూరల్‌: వెల్లుల్ల, విట్టంపేట, మెట్లచిట్టాపూర్‌, కొండ్రికర్ల, బండలింగాపూర్‌, కోనరావుపేట, చౌలమద్ది, జగ్గసాగర్‌, పెద్దాపూర్‌ తదితర గ్రామాల్లో చీరెలు పంపిణీ చేశారు. జడ్పీటీసీ కాటిపెల్లి రాధాశ్రీ, ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు గూడూరు రజిని, ఆకుల రాజిరెడ్డి, బద్ధం శేఖర్‌, ఆకుల రాజగంగు, జంగిటి అంజయ్య, కోరెపు శ్యామల, గడ్డం లింగారెడ్డి, సుగుణ తదితరులున్నారు.

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలో ఎంపీపీ జాజాల భీమేశ్వరి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ లత, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ రామిరెడ్డి, ఎంపీటీసీ రాములు, నాయకులు చిన్నారెడ్డి, జగన్‌రావు, సత్యనారాయణ, రాజిరెడ్డి, మోహన్‌, యాసీన్‌ తదితరులున్నారు.  

మల్యాల: రామన్నపేటలో బతుకమ్మ చీరెలను సర్పంచ్‌ గడ్డం జలజ పంపిణీ చేశారు.  మండల కోఆప్షన్‌ సభ్యుడు అజహర్‌, ఉపసర్పంచ్‌ తిరుపతిరెడ్డి తదితరులున్నారు.  logo