గురువారం 03 డిసెంబర్ 2020
Jagityal - Oct 17, 2020 , 02:08:07

నిర్మాణాలు దసరాలోగా పూర్తి చేయాలి

నిర్మాణాలు దసరాలోగా పూర్తి చేయాలి

కలెక్టర్‌ గుగులోతు రవి

జిల్లాలో చేపట్టిన డబుల్‌ బెడ్రూం నిర్మాణ పనుల పరిశీలన

జగిత్యాల రూరల్‌: డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను దసరాలోగా నాణ్యతతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల మండలం చల్‌గల్‌లో చేపట్టిన 20 డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను పరిశీలించి, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. కలెక్టర్‌ మట్లాడుతూ.. తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, మురుగు కాలువలు తదితర నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, ఆర్డీవో మాధురి, పీఆర్‌ ఈఈ రహమాన్‌, హౌసింగ్‌ డీఈ రాజేశ్వర్‌, తహసీల్దార్లున్నారు. 

మల్యాల: నూకపల్లి గ్రామ శివారులో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను కలెక్టర్‌ రవి పరిశీలించారు. పనులను మూడురోజుల్లోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తికాగా, డ్రా పద్ధతిలో కేటాయించనున్నట్లు తెలిపారు. త్వరలో ఇండ్లను ప్రారంభించేందుకు రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి రానున్నారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, పీఆర్‌ ఈఈ రహమాన్‌, డీఈఈ మాధవరావు, ఏఈఈ జ్ఞానేశ్వర్‌, హౌసింగ్‌ డీఈఈ రాజేశ్వర్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ రవీందర్‌రావు, నాయబ్‌ తహసీల్దార్‌ చిలుకల కృష్ణ, బతికపల్లి సర్పంచ్‌ తాటిపర్తి శోభారాణి తదితరులున్నారు.  

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను కలెక్టర్‌ రవి పరిశీలించారు. దసరాలోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉం చాలని సూచించారు. గోధూర్‌లో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని కోరారు. అదనపు కలెక్టర్‌ రాజేశం, ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ స్వర్ణ, ఎంపీపీ జాజాల భీమేశ్వరి, సహకార సంఘం అధ్యక్షుడు బద్ధం గోపి, ఎంపీటీసీలు రాములు, చిన్నారెడ్డి తదితరులున్నారు.   

మెట్‌పల్లి:  పట్టణ శివారులోని అర్బన్‌హౌస్‌ కాలనీలో నిర్మిస్తున్న 110 డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను కలెక్టర్‌ రవి పరిశీలించారు. అంతర్గత రహదారులు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, సెప్టిక్‌ ట్యాంకులు, డ్రైనేజీలు తదితర మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, పీఆర్‌ఈఈ రహమాన్‌, హౌసింగ్‌ డీఈఈ రాజేశ్వర్‌, ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లున్నారు. 

మేడిపల్లి: కల్వకోట గ్రామంలో చేపట్టిన డబుల్‌ బెడ్రూం నిర్మాణాలను కలెక్టర్‌ రవి పరిశీలించారు. ఆయన వెంట అడిషనల్‌ కలెక్టర్‌ రాజేశం, ఆర్డీవో వినోద్‌కుమార్‌, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, పీఆర్‌ ఈఈ రహమా న్‌, హౌసింగ్‌ డీఈఈ రాజేశ్వర్‌ తదితరులున్నారు.

కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనుల పరిశీలన

జగిత్యాల: ధరూర్‌ క్యాంపులో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ పనులను కలెక్టర్‌ రవి పరిశీలించారు. పనులు దాదాపుగా పూర్తయినందున త్వరలో ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పనులపై కలెక్టర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం తదితరులున్నారు.