బుధవారం 28 అక్టోబర్ 2020
Jagityal - Oct 02, 2020 , 02:29:14

లక్ష్మికి పరిహారం అందింది..

లక్ష్మికి పరిహారం అందింది..

జగిత్యాల/ వెల్గటూర్‌ : ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన బాధితురాలికి మంత్రి కొప్పుల చొరవతో పరిహారం అందింది. భర్త పేరు తప్పుగా పడడం.. తమకు ఇబ్బందులు వస్తాయని అధికారులు నిలిపివేయడంతో మూడేండ్ల నుంచి సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆమె మంత్రికి విన్నవించడంతో పరిష్కారమైంది. గురువారం చెక్కు అందింది. అందుకు సంబంధించి పూర్తి వివరా లు ఇలా ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామమైన చెగ్యాంకు చెందిన కూనారపు లక్ష్మి ఇంటికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద 7లక్షల 15వేల 982 పరిహారం మంజూరైంది. అయితే, రికార్డుల్లో ఆమె భర్త పేరు తప్పుగా నమోదు కావడంతో మూడేం డ్ల నుంచి పరిహారం అందలేదు. ఈ సమస్యను గత నెలలో మంత్రి కొప్పులకు విన్నవించడంతో వెంటనే స్పందించారు. అధికారులతో మాట్లాడి తప్పును సరి చేయించారు. దీంతో పరిహారం రాగా, గురువారం జగిత్యాలలోని కలెక్టర్‌ కార్యాలయంలో లక్ష్మికి మంత్రి చెక్కును అందజేశారు. పరిహారం వచ్చేందుకు చొరవ చూపిన మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. logo