బుధవారం 28 అక్టోబర్ 2020
Jagityal - Oct 02, 2020 , 02:29:13

నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

కార్పొరేషన్‌: కరీంనగర్‌ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. ఈ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) నిధులు 70 లక్షలతో సుందరీకరించిన నగరపాలక సంస్థ పరిధిలోని జగ్జీవన్‌రాం (మంచిర్యాల) చౌరస్తాను మంత్రి గురువారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలోని అన్ని చౌరస్తాలను అభివృద్ధి చేస్తున్నామని చె ప్పారు. సుడా నిధులతో మొట్టమొదటిసారి చేపట్టిన ఈ పనులను వేగంగా పూర్తి చేసి ప్రారంభించడం ఆనందం గా ఉందన్నారు. ఇతర చౌరస్తాల సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చౌర స్తా ప్రారంభోత్సవం సందర్భంగా స్థానికులు, నాయకులు పటాకలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిష న్‌, సుంకె రవిశంకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ శశాంక, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు కంసా ల శ్రీనివాస్‌, గంట కళ్యాణి, మేచినేని వనజారావు, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, ఎంపీటీసీ తిరుపతినాయక్‌, సుడా అడ్వైజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


logo