శనివారం 31 అక్టోబర్ 2020
Jagityal - Sep 29, 2020 , 02:10:51

ఎమెల్సీ ఎన్నికల్లో కవిత గెలువాలని.. 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్‌

ఎమెల్సీ ఎన్నికల్లో కవిత గెలువాలని.. 108 కొబ్బరికాయలు కొట్టిన కౌన్సిలర్‌

జగిత్యాల రూరల్‌:  నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎంపీ కవిత భారీ మెజార్టీతో గెలువాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్‌ గుగ్గిళ్ల హరీశ్‌ ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో ఆయ న సాయినాథుడికి ప్రత్యేక పూజలు చేపట్టి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొవిడ్‌-19 వైరస్‌ విజృంభిస్తున్న క్రమంలో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని మొక్కులు చెల్లించుకున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత గెలుపు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.