శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 28, 2020 , 02:54:49

తెలంగాణ దార్శనికుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

తెలంగాణ దార్శనికుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ

కోరుట్ల: స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండాలక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ దార్శనికుడని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. పట్టణంలోని కార్గిల్‌ చౌక్‌ వద్ద ఆదివారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లక్ష్మణ్‌ జయంత్యుత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో గొంతెత్తి పోరాడిన మహనీయుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్‌ ఆధికారి వినోద్‌కుమార్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు అన్నం లావణ్య,  పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్‌, నాయకులు గడ్డం మధు, వాసం భూమానందం, ఎంబేరి నాగభూషణం, జిందం లక్ష్మీనారాయణ, ఆడెపు మధు, ముల్క ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు అన్నం అనిల్‌, ప్రధాన కార్యదర్శి మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొండాలక్ష్మణ్‌ ఆశయాలను కొనసాగించాలి

జగిత్యాల రూరల్‌ : కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను కొనసాగించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు.  పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో  జిల్లా కేంద్రంలో నిర్వహించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  జగిత్యాల పట్టణంలోని అంగడి వద్ద ఉన్న కొండా లక్ష్మణ్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ఉద్యమాన్ని కొనసాగించి రాష్ర్టాన్ని సాధించారన్నారు. కార్యక్రమంలో జగిత్యాల అడిషన్‌ కలెక్టర్‌ బేతి రాజేశం, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి జీఆర్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆనందరావు, గిరి, శేఖర్‌, మొగిలి, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌ ఎంపీడీవో కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ 105వ జయంతిని అధికారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ గంగారాంగౌడ్‌, ఎంపీడీవో గంగాధర్‌, సిబ్బంది పాల్గొన్నారు.