శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 27, 2020 , 02:13:02

బాలు మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు

బాలు మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల: సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక దేవిశ్రీ గార్డెన్‌లో కళాశ్రీ ఆర్ట్స్‌ థియేటర్స్‌ గుండేటి రాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బాలసుబ్రహ్మణ్యం సంతాపసభకు ఎమ్మెల్యే హాజరయ్యారు. బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. బాలు పాటలు అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. అనంతరం పలువురు గాయకులు బాలు పాడిన పాటలు పాడి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీవీ సూర్యం, బండ శంకర్‌, గట్టు సతీశ్‌, రేగొండ నరేశ్‌, రాంప్రసాద్‌, జగదీశ్వర్‌, సావేర్‌, సుబ్రహ్మణ్యం, కిషన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, మహిపాల్‌, పరశురాంగౌడ్‌, మల్లిక్‌ తేజ, మహేందర్‌, దేవయ్య, సరోజన, జమున, ఆనందరావు, శ్యాంసుందర్‌, రవి, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఇబ్రహీంపట్నం: మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో సినీ నిర్మాత అంకతి భరత్‌కుమార్‌, కళాకారులు రమేశ్‌, ప్రభాకర్‌, అశోక్‌, నాయకులు గంగారెడ్డి, దేవదాస్‌, వెంకటస్వామి, దశరథం తదితరులు పాల్గొన్నారు.