మంగళవారం 27 అక్టోబర్ 2020
Jagityal - Sep 27, 2020 , 02:13:03

సిలబస్‌ ప్రకారం డిజిటల్‌ క్లాసులు

సిలబస్‌ ప్రకారం డిజిటల్‌ క్లాసులు

  • n పాఠశాలల్లో 10వేల మొక్కలు నాటాం
  • n వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
  • n స్థాయీ సంఘాల సమావేశంలో జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత

జగిత్యాల: కరోనా వైరస్‌ నేపథ్యంలో విద్యార్థులకు సిలబస్‌ ప్రకారం డిజిటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నట్లు జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శనివారం జడ్పీ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దావ వసంత మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 శాతం ఉపాధ్యాయులు ఒకరోజు, మిగిలిన 50శాతం ఉపాధ్యాయులు రెండో రోజు విధులు నిర్వహిస్తున్నారన్నారు. హరితహారం కింద పాఠశాలలకు కేటాయించిన 10వేల మొక్కలను అన్ని పాఠశాలల్లో నాటారన్నారు. జిల్లాలో వైద్యశాఖ పనితీరు బాగుందని, గతంలో కంటే కరోనా కేసులు తగ్గుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు గ్రామీణ ప్రాంతంలోని అందరికీ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం నిర్వహిస్తున్న సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్య కార్య నిర్వహణాధికారి ఎ.శ్రీనివాస్‌, జిల్లా పరిషత్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. logo