శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jagityal - Sep 27, 2020 , 02:13:10

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

పేదలకు అండగా సీఎం సహాయ నిధి

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

జగిత్యాల రూరల్‌: నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన కందుకూరి మణికంఠ ఇటీవల శస్త్ర చికిత్స చేసుకొని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ.16వేల చెక్కును ఎమ్మెల్యే శనివారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అందజేశారు. చెక్కు మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రూరల్‌ ఎంపీపీ గాజర్ల గంగారాంగౌడ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా యూత్‌ అధ్యక్షుడు దావ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే జగిత్యాల రూరల్‌ మండలం అనంతారానికి చెందిన సల్లూ రి జల మృతి చెందగా, బాధిత కుటుంబ సభ్యులను జగిత్యాల ఏరియా దవాఖానలో ఎమ్మెల్యే పరామర్శించారు.   

నిరుపేదలకు భరోసా సీఎం సహాయనిధి

మెట్‌పల్లి: పేద, మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి భరోసా ఇస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మెట్‌పల్లిలోని క్యాంప్‌ కార్యాలయ ఆవరణలో పట్టణంతోపాటు ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, మెట్‌పల్లి మండలాలకు చెందిన 50మంది లబ్ధిదారులకు రూ.10.80లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్‌, కార్పొరేట్‌ దవాఖానల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆందోళన చెందవద్దన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌, షాదీముబారక్‌, కల్యాణలక్ష్మి పథకాల ద్వారా లబ్ధిపొందడంలో కోరుట్ల నియోజకవర్గం ముందంజలో ఉందన్నారు. అర్హులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. logo