బుధవారం 21 అక్టోబర్ 2020
Jagityal - Sep 25, 2020 , 02:28:15

జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

జగిత్యాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

  • జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల : జగిత్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని నర్సింగాపూర్‌ డంప్‌ యార్డులో రూ.54లక్షలతో పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రం, అప్రోచ్‌ రోడ్డు పనులకు ఎమ్మెల్యే సంజయ్‌, మున్సిపల్‌ అధ్యక్షురాలు శ్రావణి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్‌ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో జగిత్యాలకు పూర్వ వైభవం వచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు పట్టణంలోని పొడి చెత్తను వేరు చేసి రీసైకిల్‌ సెంటర్‌కు పంపించే విధంగా పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఇక్కడ ఫికల్‌ స్లడ్జ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం జరుగుతుందని, ఈ ప్లాంట్‌లో సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలతో ఎరువును తయారు చేస్తారన్నారు. మున్సిపల్‌ అధ్యక్షురాలు మాట్లాడుతూ స్వచ్ఛ జగిత్యాల దిశగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణ ప్రజలు చెత్తను తడి, పొడిగా విభజించి మున్సిపల్‌  వాహనానికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ మారుతీప్రసాద్‌, డీఈ లచ్చిరెడ్డి, కౌన్సిల్‌ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సారంగాపూర్‌ : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల ఆవరణలో గురువారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 121 మందికి రూ. 1.21 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి చెక్కులు, 13 మందికి రూ. 2.60 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చీరెలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. త్వరలోనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపడుతామన్నారు. డీడీలు తీసిన యాదవులకు రెండో విడుత గొర్ల పంపిణీ చేస్తామన్నారు. కోనాపూర్‌లో డీఎంఎఫ్‌టీ నిధులు 2.76 లక్షలతో నిర్మించే అంబేద్కర్‌ సంఘ భవనానికి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోల జమున, జడ్పీ సభ్యుడు మేడిపల్లి మనోహర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ సురేందర్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కోల శ్రీనివాస్‌, పార్టీ అధ్యక్షుడు గుర్రాల రాజేందర్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌ రావు, వెంకటరమణారావు, వెంకటేశ్‌, గంగు, జమున, సంతోష్‌, రామారావు, లక్ష్మి, జయ, లావణ్య, ఆకుల జమున, శ్రీలత, విమల, రాజేశ్వరి, బుచ్చిమల్లు, రాజన్న, గురునాథం మల్లారెడ్డి, రాజేశం, నర్సింహారెడ్డి, అమీర్‌, శేఖర్‌ గౌడ్‌, రమేశ్‌, రాజేశం, ఆనంద్‌రాజ్‌, వంశీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo