శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jagityal - Sep 25, 2020 , 02:28:16

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే  ధ్యేయం

  • n నిండిన చెరువులతో  రైతుల కష్టాలు దూరం     
  • n ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌
  • n గుండ్లపల్లి దేవుని చెరువు,   గునుకులకొండాపూర్‌ పటేల్‌ చెరువుల్లోకి చేప పిల్లలు విడుదల

గన్నేరువరం: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే     తెలంగాణ సర్కారు ధ్యేయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఉద్ఘాటించారు. మండలంలోని గుండ్లపల్లి దేవుని చెరువులో 15 వేలు గునుకులకొండాపూర్‌ పటేల్‌ చెరువులో 45 వేల చేప పిల్లలను గురువారం విడుదల చేశారు. అనంతరం కాళేశ్వరం జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువులను మరమ్మతు చేయించారని చెప్పారు. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఆ చెరువులను నింపారని పేర్కొన్నారు.  మత్స్యకారులు ఈ జలాల్లో చేపలు పెం చు కుంటూ ఉపాధి పొందుతున్నారని చెప్పారు. వారికి ప్రభుత్వం మోపెడ్‌లు, ట్రాలీ ఆటోలు  అందజేస్తూ అండగా నిలుస్తుందన్నారు.  చెరువులు మత్తళ్లు దూకుతుండడంతో ఈ యేడు అన్నదాతలకు నీళ్ల కష్టాలు దూరమవుతాయన్నారు.   గతేడాది చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు దండిగా లాభాలు గడించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు నందికొండ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు గూడెల్లి ఆంజనే యులు, సర్పంచ్‌ లింగంపెల్లి జ్యోతి,  టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అ ధ్యక్షుడు న్యాలపట్ల శంకర్‌  నేతలు ఏలేటి చం ద్రారెడ్డి, లింగాల మహేందర్‌రెడ్డి, తోట కోటేశ్వర్‌, గొంటి సంతోష్‌, తాడూరి వెంకట ర మణారెడ్డి, హన్మాండ్ల నర్స య్య, లింగంపెల్లి బాల్‌రాజు, సుధగోని మల్లేశం గౌడ్‌, న్యాలపట్ల  పరుశరాం, న్యాలపట్ల లక్ష్మణ్‌, నాగపూరి శంకర్‌, టీ శ్రీనివాస్‌  తదితరులు పాల్గొన్నారు.

 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత..

గునుకుల కొండాపూర్‌ గ్రామానికి చెందిన తా ళ్లపెల్లి విజయ్‌కుమార్‌గౌడ్‌కు రూ.20, 000  సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అలాగే టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షు డిగా నియమితుడైన హన్మాజిపల్లి గ్రామానికి చెందిన నంది కొండ వెంకట్‌రెడ్డికి  నియా మక పత్రాన్ని అందించారు.